Breaking News

వికాస జాబ్ మేళా కి హాజరైన 84 మంది

-ఎనిమిది కంపెనీల్లో ఉద్యోగాలకు పొందిన 55 మంది అభ్యర్థులు
-కలెక్టర్ డా. కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరెట్ లో శనివారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో “వికాస ” వారిఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వికాస్ వారి ఆధ్వర్యంలో వివిధ ప్రవేటు కంపెనీ లు ఔత్సహిక యువతి యువకులకు ఇంటర్వూలను నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత జాబ్ మేళా వివరాలు తెలుపుతూ, శనివారం ఎనిమిది ప్రవేటు కంపెనీ లు హాజరై ఇంటర్వ్యూ లను నిర్వహించగా మొత్తం 84మంది హాజవ్వగా వారిలో 55 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగం ఏదైనా మీ ఉద్యోగాన్ని గౌరవించండి, తద్వారా విధి నిర్వహణలో మీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే, భవిష్యత్తులో తప్పకుండా ఉన్నత శిఖరాలు చేరుకో గలుగుతారన్నారు. వికాస – కలెక్టరేట్‌లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కి శనివారం మొత్తం 84 మంది అభ్యర్థులు హాజరవ్వగా 55 మంది ఎంపికైనట్లు పేర్కొన్నారు. షార్ట్లిస్ట్ లో ఉన్న 55 అభ్యర్దులు కంపెనీ వారీగా ఇసుజు లో 17 మంది, హ్యుందాయ్ మోబిస్ 4 గురుకి, ఇండిగో లో 5 గురుకి, వరుణ్ మోటార్స్ 10 మంది, డిజి రుణాలు 10 మంది, డి మార్ట్ లో 4 గురు, స్కిల్ సోనిక్స్ ఎల్ టి ఎస్ లో ఇద్దరు, డుగ్కీ కంపెనీకి ముగ్గురు అభ్యర్థులు ఉద్యోగాలను పొందినట్లు ఆమె తెలియచేశారు. ఈ జాబ్ మేళా ను వికాస్ జిల్లా మేనేజర్ కొండూరి శర్మ, రాజమహేంద్రవరం రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ లు కంపెనీ ప్రతినిధులతో సమన్వయంచేసుకున్నారు.

Check Also

ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం

-చిత్ర పరిశ్రమ కోసం కొత్త ఫిల్మ్ పాలసీని తీసుకొస్తాం -గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వెల్లడించిన రాష్ట్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *