-ఆయా సంక్షేమ కార్యక్రమాలు అమలులో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం చేయండి
-స్పందనలో 126 ఫిర్యాదులు నమోదు అయ్యాయి- కలెక్టర్ డా. కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రతి ఫిర్యాదును మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత కాల పరిమితి లో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ , డిఆర్వో బి.సుబ్బారావు తో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే సమయంలో ప్రజా ప్రతినిధులకు భాగస్వామ్యం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయా నియోజక వర్గాల పరిధిలో, మండలాలు పరిధిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలు వివరాలు స్థానిక ప్రజా ప్రతినిధులకు ముందస్తు సమాచారం అందివ్వాలని తెలియచేశారు. మార్గదర్శకాలు పాటించని ప్రోటోకాల్ పాటించని వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఈరోజు స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి మొత్తం 126 ఫిర్యాదులను స్వీకరించామన్నారు.
జిల్లా అధికారులు శాఖా పరంగా క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాల సమాచారాన్ని ప్రజా ప్రతినిధులకు తెలియజేయడంతో పాటు ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటిస్తూ , ఆయా కార్యక్రమాలకు ఆహ్వానించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనా చేస్తూ శాఖాపరంగా జిల్లాపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు విభాగాల వారీ చేపట్టిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారికి ముందుగానే తెలియ జేయాలన్నారు. వాటి ప్రగతిని WhatsApp groups లో పోస్టింగ్ చేయాలన్నారు. స్పందన అనంతరం కలెక్టర్ డాక్టర్ మాధవిలత స్పందన ఫిర్యాదుల పై అధికారులతో సమీక్షిస్తూ శాఖల వారిగా వివరాలు తెలియచేశారు. జిల్లాలో 29 శాఖలకు చెందిన స్పందన ఫిర్యాదులు 391 పరిష్కరించ వలసినవి ఉన్నాయన్నారు. రాష్ట్రస్థాయి సగటు లోపల పరిష్కారం చుపాల్సినవి 391 ఉండగా వాటిలో అత్యధికంగా పంచాయతీ రాజ్ పరిధిలో 68, రెవెన్యూ పరిధిలో 214, విద్యుత్ సంస్థ పరిధిలో 28 , సర్వే సెటిల్ మెంట్ లో 15, సచివాలయ పరిధిలో 11 ఉన్నాయన్నారు.
రాష్ట్ర స్థాయి సగటు లోపల పరిష్కారం కానివి , స్పందనలో తిరిగి వచ్చిన కేటగిరీలో మొత్తం 75 ఉండగా వాటిలో శాఖల వారీగా అత్యధికంగా పరిష్కారంచేయవలసినవి పంచాయరాజ్ పరిధిలో 28, రెవెన్యూ లో 14, సచివాలయాల పరిధిలో 15 ఉన్నాయన్నారు. ఈ స్పందన స్పందన కార్యక్రమం లో జేసీ సిహెచ్. శ్రీధర్, డీఆర్వో బి. సుబ్బారావు, జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ ఇంచార్జి డా.వసుందర, ఇమ్మునైజేషన్ అధికారిణి డా. జ్యోతి, జిల్లా గృహనిర్మాణ అధికారి బి. తారాచంద్, సీపీఓ శ్రీమతి పి.రాము, డిఎమ్ సివిల్ సప్లై కె.తులసి, డిఎస్ఓ పి.ప్రసాదరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఎస్టిజి సత్యగోవిందం, డీఈఓ అబ్రహం, డీఎస్ ఈడబ్ల్యూ & ఈఓ ఎమ్ ఎస్ శోభారాణి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.