Breaking News

అన్నిరకాల సదుపాయాలతో PP1, PP2 తో హై స్కూల్ వరకు భోధన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కృష్ణలంక లోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పోరేషన్ హైస్కూల్ ను స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరి బి.రాజశేఖర్, ఐ.ఏ.ఎస్., మున్సిపల్ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, మరియు ఇతర అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంలో APSRMCH స్కూల్ ఓకే స్పోర్ట్స్ స్కూల్ గా తీర్చిదిద్దుటకు గల అవకాశాలు మరియు సాధ్యా సాధ్యాలను పరిశీలించాలని అన్నారు.
సర్వోదయా విద్యా తరహ భోధన పద్దతిలో పాఠశాలలను తీర్చే క్రమములో VMC నెహ్రునగర్ ప్రైమరీ స్కూల్, VMRR ప్రాధమిక పాఠశాల మరియు VMRR బాలికల ప్రత్యేక ఉన్నత పాఠశాలలను మరియు పాఠశాల పరిధిలోని ఇండోర్ స్టేడియం మరియు జూనియర్ కాలేజీ పరిశీలించి అధికారులు మరియు ఉపాద్యాయులకు పలు సూచనలు చేశారు. అదే విధంగా VMRR గర్ల్స్ హై స్కూల్ ను అన్నిరకాల సదుపాయాలతో PP1, PP2 తో హై స్కూల్ వరకు భోధన సాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
విద్యా సంచాలకులు సురేష్ కుమార్, నాడు నేడు ఇన్ ఫ్రా జాయింట్ డైరెక్టర్ మురళి, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పుప్పాల నరసకుమారి, జిల్లా విద్యా శాఖాధికారి సి.వి రేణుక, విజయవాడ డివిజన్ డి.వై.ఇ.ఓ కె.రవి కుమార్, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, స్కూల్ సూపర్ వైజర్లు కె.రాజశేఖర్, ఎస్.కె సైదా సాహెబ్, పాఠశాలల ప్రధానోపాద్యాయులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *