
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ వైస్సార్ ఎంప్లాయిస్ రాష్ట్ర ప్రధమ వార్షికోత్సవం గాంధీ నగర్ స్థానిక కౌతా పూర్ణానంద సత్రం లో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశం లో ముఖ్య అతిధి ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి ఆర్టీసీ ఎంప్లాయిస్ పాల్గొనడం చాల ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన రాయితీలన్నీ వస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రామపల్లె దేవరాజులు మాట్లాడుతూ ఈ నెల నుండి మాకు రావలసిన ప్రభుత్వ రాయితీలన్నీ వస్తున్నాయని అందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి ఆస్కార్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెత్తాం శ్రీనివాస్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీ రాజేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి పి రావు, రవి బాబు, నారాయణ, ఉప ప్రధాన కార్యదర్సులు షైక్ అబీబ్, టి రవిశంకర్, మహిళా ప్రతినిధి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News