Breaking News

శ్రీ కార్య సిద్ధి ధ్వజ స్తంభం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ స్థానిక అరండల్ పేట లో శ్రీ కార్యసిద్ధి గణపతి ప్రతిష్ఠ మరియు నూతన జీవ ధ్వజ ప్రతిష్ఠ శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయము నందు ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రెసిడెంట్ శివయ్య మాట్లాడుతూ ఆలయ కమిటీ, వ్యయప్రయాసలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, వేలాది మంది భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. కోశాధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ ప్రతిష్ట శ్రీ కనక దుర్గ మల్లేశ్వర దేవాలయం నందు కార్మిక నగర్ లో ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బి. దుర్గారావ్, వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *