విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ హాల్ నందు నేషనల్ ఫిలాంత్రోపిక్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉమెన్స్ ఐకాన్ అవార్డ్స్ ప్రధాన ఉత్సవం సందర్భంగా అత్యంత శక్తివంతమైన సేవలకు గాను జాతీయ స్థాయిలో అమలాపురం మండలం బండారులంక గ్రామ సర్పంచ్ పెనుమాల సునీత ని ఎన్నిక చేసిన సందర్భంగా డాక్టర్ అద్దంకి రాజా యోనా మరియు జాతీయ అంతర్జాతీయ కవివర్యులు కత్తిమండ ప్రతాప్ మరియు కమిటీ సభ్యుల సమక్షంలో ప్రశంసా పత్రం మెమెంటో బహూకరించారు. సామాజికవేత్త, చుట్టుపక్కల గ్రామాల వారికి సుపరిచితురాలు పెనుమాల సునీత గ్రామీణ అభివృద్ధి, మహిళా అభ్యుదయానికి ఎంతో కృషి చేస్తున్నారు. చేతనైనంతలో చుట్టుపక్కల వారికి సాయం చేస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ దంపతులు ఆదుకుంటారని చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరికి పేరుంది. కరోనా టైంలో మరియు వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను ప్రజలతో మమేకమైన మహిళగా ధైర్యంగా నిలబడి ప్రజలకు సేవ చేసిన దానికిగాను బహూకరించిరీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళ మణులను గుర్తించి పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ములపర్తి సత్యనారాయణ కోరుకొండ ప్రభాకర్ దొమ్మేటి రామారావు పెనుమాల ఏడుకొండలు వివిధ రంగాలలో నిష్ణాతులైన పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …