-జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి
-డ్రగ్స్ మహమ్మారిని అరికట్టగలిగేవి మన రెండు కళ్ళే.. జేసీ శ్రీధర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“సమాజంలో చైతన్యం, తల్లిదండ్రుల ప్రేమ” అనే ఆయుధం ద్వారా పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టడం సాధ్యం అవుతుందని జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో “మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం” నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి పి. వెంకట జ్యోతిర్మయి మాట్లాడుతూ, పిల్లల్లో చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లను అలవర్చుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. డ్రింక్స్ వంటి పానీయాలను చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తున్నామని, వీటిలో కూడా కొంత ఆల్కహాలు కలిసే అవకాశం ఉందన్నారు. మరి ముఖ్యంగా పిల్లలతో తల్లిదండ్రులు వ్యవహరించే తీరు మారాల్సి ఉందన్నారు. చదువు లో ఫస్ట్ వస్తేనే నా బిడ్డగా గర్వ పడతామని తల్లితండ్రులు పిల్లలకు చెప్పడం ద్వారా వారు నూన్యతా భావనకు గురై చెడు అలవాట్లకు గురి అవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. సమాజంలో చైతన్యం, తల్లిదండ్రుల ” ప్రేమ అనే ఆయుధం” ద్వారా మాత్రమే సమాజంలో మాదక ద్రవ్యాలు వినియోగం నియంత్రించగల మని పేర్కొన్నారు.
వేగంగా డబ్బు సంపాదించాలంటే ఆలోచనతో యువత వారి తెలియకుండానే డ్రగ్స్ అక్రమ రవాణా లో భాగస్వామ్యం ఎంతో బాధాకరం అని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ పేర్కొన్నారు. తద్వారా వారికి తెలియకుండానే ఎంతో విలువైన భవిష్యత్తు ను కోల్పోవడం చూడడం జరిగిందన్నారు. ప్రయత్నం చేసిన ప్రతిసారి గెలవలేక పోవచ్చు , కానీ ప్రయత్న లోపం ఉండకూడదని కలెక్టర్ తన సందేశం పంపడం జరిగిందన్నారు. అజాదికా అమృత్ మహోత్సవ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు దుర్వినియోగం దినోత్సవం జరుపుకోవడం అభినందనీయం అన్నారు. ఈ మహమ్మారిని అరికట్టడానికి న్యాయ , పోలీస్, జిల్లా యంత్రాంగ వ్యవస్థలు కలిసి కట్టుగా పనిచేయ్యాల్సి ఉందన్నారు. అయినా కూడా ఇది ఒక పెద్ద మహమ్మారి అని, ఈ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు మరో పెద్ద వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. అవి మన రెండు కళ్ళు అని, తయారు, రవాణా, వినియోగం పై ప్రతి దగ్గరా నిఘా ఉండాలని, ఇందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన ఎంతో అవసరం అన్నారు. ఇటువంటి మహమ్మారి ని నియంత్రించడం ద్వారా భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కలిసి కట్టుగా అడుగులు వేద్దామని జేసీ శ్రీధర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 90 శాతం మాదక ద్రవ్యాలు సేవించిన మత్తు లో జరుగుతున్నయని, 20 శాతం మందికి స్థూల కాయం వస్తుందని, 40 శాతం మంది మానసిక ఒత్తిడి కి లోనువుతారని, 25%మంది ఆత్మహత్యా చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయన్నారు. దేశంలో 100మిలియన్ మంది డ్రగ్స్ కి బానిసలైయ్యారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎమ్. రజనీ, ఒకటవ అదనపు జెడ్జి కె. సునీత, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ఎమ్. సుబ్బారావు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ. శివప్రసాద్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు డి. విజయ గౌతమ్, పి ఆర్ రాజీవ్, ఎమ్. నాగేశ్వర రావు, స్పెషల్ జెడ్జి ఏ సి బి – యూ యూ ప్రసాద్, సిడిపివో సిహెచ్. వి. నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News