పారా అథ్లెట్ రవణి విజయంపై క్రీడాశాఖ మంత్రి అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
జపాన్‌లో జరుగుతున్న 5వ ఆసియా పారా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత అథ్లెట్ రవణి వలసనైనిని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. రవణి పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఆమె విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. రవణి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.