ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి చంద్రబాబు

Cm

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. నరకాసురుని చెర నుంచి లోకానికి విముక్తి కలిగించి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు చిగురించాలని, మనం వెలిగించే ప్రతి దీపం ఇంటికే కాకుండా సమాజానికి కూడా వెలుగునివ్వాలని ఆకాంక్షించారు. సాటి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడం కూడా పండుగలో భాగం కావాలని తెలిపారు. భారతీయ పండుగలు అందించే సందేశాలను అర్థం చేసుకుని పరస్పర సహకారం, ఐకమత్యంతో సమాజమంతా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.