విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ బాబు విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న ఈ-సంజీవని శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న వైద్య సిబ్బందితో మాట్లాడి, టెలీమెడిసిన్ సేవలు, ఆన్లైన్ వైద్య సంప్రదింపుల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు.
గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ-సంజీవని సేవలను సమర్థవంతంగా వినియోగించాలని సిబ్బందికి సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసి, టెలీమెడిసిన్ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయాలని కోరారు.
ఈ-సంజీవని ద్వారా ప్రజలకు సులభంగా, వేగంగా వైద్య సలహాలు అందించవచ్చని డాక్టర్ శ్రావణ బాబు పేర్కొన్నారు.
ఈ-సంజీవని శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ
