ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ బన్సల్ శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ బన్సల్
