-ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతాం: జాతీయ బీసీ సంక్షేమ సంఘం హెచ్చరిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర జనాభాలో 50 నుంచి 55 శాతం వరకు ఉన్న బీసీలకు రాజకీయ పదవుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 30 మందికి పైగా బీసీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, డిప్యూటీ మేయర్ పదవిలో బీసీలకు అవకాశం కల్పించకపోవడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
మంగళవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర నాయకులు కనిశెట్టి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో రెండో డిప్యూటీ మేయర్ పదవిని ఏర్పాటు చేసి, ఆ పదవిని బీసీలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ అధికారంలో సముచిత వాటా కల్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు, కార్పొరేషన్ల ముట్టడి, నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు, సత్యాల సతీష్ కుమార్, అడ్వకేట్ పిల్లా శ్రీనివాసరావు, పిసా అరుణ్ కుమార్, తమ్మిన దుర్గారావు, బాడిశ రూపేష్, బాడిశ సాంబశివరావు, సగురుపిళ్ల శ్రీకాంత్, కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
