-మున్సిపల్, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు.. రానున్న సహకార సంఘాల ఎన్నికలపై చర్చ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురాం, ఆప్కాబ్ చైర్మన్ గన్నీ వీరాంజనేయులుతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఉండవల్లిలోని మంత్రి నివాసంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ ఎన్నికల్లో నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కనబరిచిన పనితీరుపై చర్చించారు. పార్టీ శ్రేణుల కృషి, కూటమి నాయకుల మధ్య సమన్వయం, సమష్టి కార్యాచరణతో సాధించిన విజయాల గురించి అభిప్రాయాలు పంచుకున్నారు.
అలాగే త్వరలో జరగనున్న సహకార సంఘాల (సొసైటీల) ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రతి సొసైటీలో పార్టీ మద్దతుదారుల విజయమే లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని చర్చించారు. పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన అంశాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
