-సీఎం సమక్షంలో టీటీడీకి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పణ
-శ్రీవారికి బంగారు ఆభరణాలు సమర్పించనున్న ఓ భక్తుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం తిరుమలకు వెళ్లనున్నారు. రేపు ఉదయం 8.30 గంటలకు అమరావతి నుంచి తిరుమలకు బయల్దేరి వెళ్లనున్నారు. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఓ భక్తుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. దాతల నుంచి బంగారు ఆభరణాలను టీటీడీ అధికారికంగా స్వీకరించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రేపు ఉదయం అమరావతి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల హెలీప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి ఘాట్ రోడ్డు మార్గంలో ప్రయాణించి ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. 11.10 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం ఉదయం 11.35 గంటలకు స్వామివారికి 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం దాతల నుంచి శ్రీవారి కిరీటం, పద్మపాదాల ఆభరణాలను టీటీడీ అధికారికంగా స్వీకరించే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి నుంచి తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగుడెం వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ముఖ్యమంత్రి అమరావతికి చేరుకుంటారు.
