సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
డా. ఎన్.ఆర్.ఎస్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, డా. ఏ.ఎల్. ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ఒక ప్రకటనలో తెలిపారు. పటమటలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ఈ శిబిరం కొనసాగింది. “ఆయుర్వేదంతో సహజసిద్ధమైన ఆరోగ్యకర జీవితం” అనే నినాదంతో జరిగిన ఈ శిబిరంలో సమగ్ర శిక్ష సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్లు డా. ఎం. భాగ్యలక్ష్మి, MD(Ay), డా. కె. లక్ష్మీ సుభద్ర, MD(Ay) తదితరులు పాల్గొన్నారు.