-6,086 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ
గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
గొల్లపూడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమి సర్పంచ్ అభ్యర్థి బొమ్మసాని జయంత్ సాయి 6,086 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా శుక్రవారం గొల్లపూడిలోని తమ కార్యాలయంలో జయంత్ సాయి మాట్లాడుతూ.. తన తాత బొమ్మసాని కృష్ణమూర్తి, తండ్రి బొమ్మసాని సుబ్బారావు అడుగుజాడల్లో నడుస్తూ బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తానని, పేద ప్రజలకు తోడుగా ఉంటూ ప్రజాసేవకు పెద్దపీట వేస్తానని తెలిపారు. తన విజయానికి అహర్నిశలు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు, అలాగే తనపై నమ్మకంతో ఓటు వేసి ఆశీర్వదించిన గొల్లపూడి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలందరినీ కలుపుకొని గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గొల్లపూడి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని హామీ ఇచ్చారు.
అనంతరం అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యుల అభ్యర్థులు, స్థానిక గ్రామ ప్రజలు బొమ్మసాని జయంత్ సాయి, బొమ్మసాని సుబ్బారావులను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బొమ్మసాని జయంత్ సాయికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత స్థాయులకు చేరుకోవాలని ఆకాంక్షించారు.