“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరం విజయవంతం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, “సుజనా ఫౌండేషన్” ద్వారా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. హెచ్ బీ కాలనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం నిర్వహించిన “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు.

ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు , ఈ సీ జీ, 2డిఎకో ఎక్స్ రే, బీపీ, షుగర్ వంటి రక్త పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్స్ వైద్య సేవలందించారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో 117 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. హెల్ప్ హాస్పిటల్ , అమరావతి ఐ హాస్పిటల్, పిన్నమనేని సిద్ధార్థ డెంటల్ హాస్పిటల్స్ డాక్టర్స్ సుజనా మిత్రా కోఆర్డినేటర్లు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది , ఈ వైద్య శిబిరంలో తమ సేవలందించారు.