పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

– వీరుళ్లపాడు, కంచిక‌చ‌ర్ల మండ‌లాల్లో జేసీ ఇల‌క్కియ పర్యటన
– డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ప‌రిశీల‌న‌

నందిగామ‌, నేటి పత్రిక ప్రజావార్త:
రెండో ద‌శ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ శనివారం వీరుళ్లపాడు మండలంలోని జుజ్జూరు, పెద్దాపురం గ్రామాలతో పాటు కంచికచర్లలో పర్యటించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల‌ని.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఇల‌క్కియ ఆదేశించారు. జేసీ వెంట నందిగామ ఆర్‌డీవో జి.అనిల్ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.