విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగర నూతన మేయర్గా బాధ్యతలు స్వీకరించిన వంగవీటి రాధాకృష్ణను గొల్లపూడి గ్రామ సర్పంచ్ బొమ్మసాని జయంత్ సాయి, గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం మేయర్ చాంబర్లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి మేయర్ తన నాయకత్వంలో కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని బొమ్మసాని సుబ్బారావు, బొమ్మసాని జయంత్ సాయి అభిలషించారు.
మేయర్ వంగవీటి రాధాకృష్ణకు బొమ్మసాని సుబ్బారావు, జయంత్ సాయి శుభాకాంక్షలు
