నూతన జడ్పీటీసీ సభ్యులకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేసిన జెడ్పీ సీఈవో పి.సుశీల

WhatsApp Image 2026 11 09 at 8.57.57 AM

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (జడ్పీటీసీ) సభ్యులుగా నూతనంగా ఎన్నికైన 15 మంది సభ్యులకు రిటర్నింగ్ అధికారి, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి.సుశీల సోమవారం ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.

స్థానిక ఎన్టీఆర్ జిల్లా జెడ్పీ సీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె విజేతలకు అధికారిక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.

విజయవాడ రూరల్ జెడ్పిటిసి అభ్యర్థి బాల కోటేశ్వరరావు నూతులపాటి (బీజేపీ) శనివారం ఎన్నిక ధ్రువపత్రం అందుకోగా, చందర్లపాడు జడ్పిటిసిగా ఎంపికైన శేఖమూరి అపర్ణ బంధువులు చనిపోయిన కారణంగా ఈ రోజు ఎన్నికల ధ్రువపత్రం పొందలేదు.

ధ్రువీకరణ పత్రాలు స్వీకరించిన సభ్యులు మాట్లాడుతూ, తమపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని, గ్రామీణాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది, నూతన సభ్యుల వెంట వచ్చిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.