ఆర్నాబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు : ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి

-బుధవారం సాయంత్రం 5 గంటల వరకు అందిన నివేదిక ప్రకారం…
-857 ప్రభావిత గ్రామాల్లో 707 గ్రామాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
-979 సబ్‌స్టేషన్లలో 156 ప్రభావితం 135 పునరుద్ధరణ , (65) 33 కేవీ ఫీడర్లలో తుఫాన్ ప్రభావితం (57) పునరుద్ధరణ
-1995 మంది సిబ్బందితో 399 ప్రత్యేక బృందాలు ఏర్పాటు
-ప్రాథమిక అంచనా ప్రకారం విద్యుత్ వ్యవస్థకు రూ.1.57 కోట్ల(ఒక కోటి యాబై ఏడు లక్షలు)నష్టం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని పలు జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లినప్పటికీ, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని ఏపీసిపీడీసీఎల్ సీఎండీ పి పుల్లారెడ్డి తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు, స్తంభాలు, సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు మరమ్మతులు చేపట్టి, విద్యుత్ సరఫరాను దశలవారీగా పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు.తుఫాన్ ప్రభావంతో మొత్తం 857 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, 707 గ్రామాల్లో సరఫరాను పునరుద్ధరించినట్లు సీఎండీ తెలిపారు. ఇంకా ఇంచుముంచు 150 గ్రామాల్లో పునరుద్ధరణ పనులు ఈ రాత్రికి పూర్తి చేసి విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం
ప్రజలు తెగిపడిన విద్యుత్ వైర్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తాకకుండా అప్రమత్తంగా ఉండాలని సీఎండీ సూచించారు. విద్యుత్ ప్రమాదాలు, సరఫరా అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1912కు తెలియజేయాలని కోరారు.
జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు
కృష్ణ -6281709355,ఎన్టీఆర్-9440817561,బాపట్ల -9281413774,
గుంటూరు -9440817526,ప్రకాశం-9440817491,పల్నాడు-7661019447.