-కరకట్ట ప్రజలకు రిటైనింగ్ వాల్ రక్షణ కవచం
-టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
24వ డివిజన్లో కూటమి కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజిని గెలుపు నల్లేరుపై నడకేనని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ డివిజన్లో జనసేన పార్టీకి ఉన్న బలమైన మద్దతు, కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో ఎన్నికల ప్రచారం ముందుకు సాగుతోందని అన్నారు. ఆదివారం ఉదయం 24వ డివిజన్ బాలాజీ నగర్ కరకట్ట ప్రాంతంలో కార్పొరేటర్ అభ్యర్థి రత్నం రజినితో కలిసి గద్దె క్రాంతి కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి కూటమి అభ్యర్థులు అయిన రత్నం రజినిని కార్పొరేటర్ గా, వంగవీటి రాధాకృష్ణను మేయర్ గా గెలిపించాలని కోరారు.
ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ 24వ డివిజన్లో కరకట్ట ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారని, వరదలు, నీటి ముప్పు వంటి సమస్యల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నిర్మించిన రిటైనింగ్ వాల్ రక్షణ కవచంలా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ చేపట్టిన ఈ నిర్మాణం స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం, వారికి శాశ్వత భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 24వ డివిజన్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. 24వ డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందని, రత్నం రజిని అభ్యర్థిత్వానికి ప్రజల మద్దతు లభిస్తోందని గద్దె క్రాంతి కుమార్ పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
