-20 మంది వార్డు సభ్యుల అభ్యర్థులతో కూటమి ప్యానెల్ నామినేషన్లు.. కార్యక్రమంలో పాల్గొన్న జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను
రామవరప్పాడు, నేటి పత్రిక ప్రజావార్త:
రామవరప్పాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రత్నం నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు 20 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు కూడా ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రత్నం నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆశీస్సులతో 20 మంది వార్డు సభ్యుల ప్యానెల్‌తో ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు. రామవరప్పాడు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ ప్యానెల్‌కు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డైరెక్టర్ గరికపాటి శివశంకర్, రిటైర్డ్ ఈవో గంటా రామ్మోహన్ రావు, విజయవాడ రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పొదిలి దుర్గారావు పాల్గొన్నారు.
అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
