-టీడీపీ అభ్యర్థి బెవర సూర్యామణికి ప్రజలు మద్దతు ఇవ్వాలి: యువ నాయకుడు బొండా సిద్ధార్థ
-వాంబే కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా.. ప్రజల మద్దతుతో ముందుకు సాగుతా: టీడీపీ అభ్యర్థి బెవర సూర్యామణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 80వ డివిజన్ వాంబే కాలనీ స్కూల్ సెంటర్ వద్ద సోమవారం సాయంత్రం ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ పాల్గొని, 80వ డివిజన్ టీడీపీ అభ్యర్థి బెవర సూర్యామణికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాలు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 27 నెలల్లో సుమారు రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. సింగ్నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేలాది మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం పేదల సొంతింటి కల సాకారానికి కీలక అడుగని పేర్కొన్నారు. డివిజన్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బెవర సూర్యామణికి వాంబే కాలనీలోని ప్రజలు తమ మద్దతు అందించాలని బొండా సిద్ధార్థ విజ్ఞప్తి చేశారు.
టీడీపీ అభ్యర్థి బెవర సూర్యామణి మాట్లాడుతూ, వాంబే కాలనీలోని ప్రజల సమస్యల పరిష్కారానికి, డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. వాంబే కాలనీలోని అన్ని బ్లాకుల ప్రజలు తనకు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలకు కూటమి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. బెవర సూర్యామణికి మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
