ఘనంగా గ్రంథాలయ వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమాలు

-విద్యార్థులకు వివిధ పోటీలు – బాలలు, యువత సమస్యలపై కవి సమ్మేళనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదో రోజు కార్యక్రమాలు నవంబర్ 18, బుధవారం విజయవాడ బందరు రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఉదయం 10 గంటలకు ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మ్యూజికల్ చైర్స్, దేశభక్తి గీతాల పోటీలు, క్విజ్, కోకో తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో సుమారు 100 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, విజ్ఞానం, క్రీడాస్ఫూర్తి, దేశభక్తి భావాలను పెంపొందించేలా పోటీలను నిర్వహించారు.
మధ్యాహ్నం 3 గంటలకు పోలుకొండ మంగతాయారు స్మారక సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కవి సమ్మేళనం, సభా కార్యక్రమం నిర్వహించారు. ‘నేర్చుకోవడానికి చదవండి.. నాయకత్వం వహించడానికి నేర్చుకోండి’ అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో విద్య, పఠనాసక్తి, నాయకత్వ లక్షణాల ప్రాధాన్యతపై వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సింహాద్రి వాణి, సుభద్ర, ఉమామహేశ్వరి, గ్రంథాలయ అధికారులు కె. రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా కార్యక్రమంలో పాల్గొని ఆసక్తిగా చర్చల్లో భాగస్వాములయ్యారు.
విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడంతో పాటు సాహిత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, విజ్ఞాన పోటీల ద్వారా వారి ప్రతిభను వెలికితీయడమే గ్రంథాలయ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమాలు చాటిచెప్పాయి.