దుగ్గిరాల, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా, దుగ్గిరాలనందు శ్రీ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, ఆలయ పున: నిర్మాణం సందర్భంగా మూడు రోజుల పాటు విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాదాత, కార్యక్రమ నిర్వాహకులు వీరంకి రవీంద్రబాబు మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి సుమారు 60 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ కొలువై వున్నారని కాలానుగుణంగావస్తున్న పరిస్థితుల దృష్ట్యా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇక్కడ కొత్తగా విగ్రహ ప్రతిష్ట, ఆలయ పున: నిర్మాణం చేపట్టామన్నారు. స్వామివారు ఎంతో మహిమ కలవారిని ఇక్కడ ప్రజల నమ్ముతూ ఇప్పటి వరకు నిత్య పూజాధికార్యాలు నిర్వహిస్తూనే వున్నారన్నారు. దైవ కార్యక్రమాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నానని, అందరికీ స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. భవిష్యత్లో మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని విధాలు సౌకర్యవంతమైన విధంగా తీర్చిదిద్దే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. నవంబర్ 10, 11, 12 తేదీలలో మూడు రోజుల పాటు పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు సుమారు 3 వేల మందిభక్తులకి అన్నప్రసాద వితరణ కావించామన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామికి ‘వైఖానసాగమ ప్రవర’ రొంపిచర్ల జనార్థన భట్టర్ ప్రత్యేక పూజలు, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, యజమాన ఆచార్య బుత్విగ్వరణం, దీక్షా స్వీకారం, అభిషేకాలు, అర్చనలు, హోమాలు, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దుగ్గిరాలలో వైభవంగా శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
