మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
పులివెందుల ఎవరి కుటుంబానికి సొంతం కాదని, ప్రజాస్వామ్యంలో అంతిమ అధికారం ప్రజలదేనని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. బుచ్చి రామ్ ప్రసాద్ అన్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబ రాజకీయ ఆధిపత్యం తగ్గుతుందనే ఆందోళన జగన్ మోహన్ రెడ్డిలో కనిపిస్తోందని విమర్శించారు. పులివెందులలో వాహనాల దహనం, రాళ్ల దాడుల ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. డమ్మీ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలను కూడా పరిశీలించాలని కోరారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలే ఇచ్చి గత పాలనపై తమ తీర్పు వెల్లడించారని గుర్తుచేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, బయోడైవర్సిటీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
