– మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను 600 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తి
– 59 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పెండింగ్
– 34 చోట్ల అధ్యక్ష ఎన్నికలు, 59 చోట్ల ఉపాధ్యక్ష ఎన్నికలు పెండింగ్
– పెండింగ్‌లో ఉన్న ఎన్నికలు రేపు (20.11.2026) ఉదయం 11 గంటలకు నిర్వహణ
– రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో మండల ప్రజా పరిషత్ (MPP) అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా 19.11.2026 నాటికి మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గాను 600 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
మిగిలిన 59 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తికావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. వీటిలో 34 మండల ప్రజా పరిషత్‌లలో అధ్యక్ష ఎన్నికలు, 59 మండల ప్రజా పరిషత్‌లలో ఉపాధ్యక్ష ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
పెండింగ్‌లో ఉన్న మండల ప్రజా పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను 20.11.2026వ తేదీ ఉదయం 11.00 గంటలకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
జిల్లాల వారీగా ఎన్నికల జరగని మండల ప్రజా పరిషత్ ల వివరాలు
1. శ్రీకాకుళం జిల్లా: గార, శ్రీకాకుళం
2. విజయనగరం జిల్లా: భోగాపురం, పూసపాటిరేగ, మెంటాడ, చీపురుపల్లి
3. అనకాపల్లి జిల్లా: బుచ్చయ్యపేట, చోడవరం, రావికమతం, రోలుగుంట
4. అల్లూరి సీతారామరాజు జిల్లా: డుంబ్రిగూడ, అరకు
5. పోలవరం జిల్లా: అడ్డతీగల, గంగవరం ఏజెన్సీ
6. కాకినాడ జిల్లా: యు.కొత్తపల్లి
7. ఏలూరు జిల్లా: పెదపాడు, లింగపాలెం
8. కృష్ణా జిల్లా: మచిలీపట్నం సౌత్, మచిలీపట్నం నార్త్,గూడూరు, నాగాయలంక
9. పల్నాడు జిల్లా: అచ్చంపేట, రొంపిచర్ల, వినుకొండ
10. బాపట్ల జిల్లా: బాపట్ల
11. ప్రకాశం జిల్లా: కొత్తపట్నం
12. మార్కాపురం జిల్లా: వెలిగండ్ల, హెచ్.ఎం.పాడు, కనిగిరి, పిసి పల్లె
13. తిరుపతి జిల్లా: వాకాడు,
ఒజిలి, వెంకటగిరి, నాగులాపురం, తొట్టంబేడు, పిచ్చాటూరు
14. అన్నమయ్య జిల్లా: ములకలచెరువు
15. వైఎస్ఆర్ కడప జిల్లా: అట్లూరు, బద్వేల్, చాపాడు, గోపవరం, పోరుమామిళ్ల, బి.కోడూరు, పులివెందుల, సింహాద్రిపురం, వీరబల్లి
16. అనంతపురం జిల్లా: కుడేరు, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, బెలుగుప్ప, పామిడి, కళ్యాణదుర్గం
17. శ్రీ సత్యసాయి జిల్లా: ముదిగుబ్బ
18. కర్నూలు జిల్లా: సి.బెళగల్, గూడూరు, మంత్రాలయం
19. నంద్యాల జిల్లా: పాగిడ్యాల, ఉయ్యాలవాడ
మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.
