విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం లబ్ధిదారులకు మంజూరైన ఎల్వోసీలను భవానీపురంలోని ఎమ్మేల్యే కార్యాలయంలో గురువారం కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, పలువురు కూటమి నాయకులు లబ్దిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. కేదారేశ్వర పేటకు చెందిన చెందిన గుర్రం సుజాత (62 ) హృద్రోగంతో బాధపడుతుండగా మెరుగైన చికిత్స కోసం రూ.9.55 లక్షలు, 57 వ డివిజన్ , కేదారేశ్వర పేట కు చెందిన షేక్ బుషీరా బేగంకు (49) గాల్ స్టోన్స్ సమస్యతో బాధపడుతుండగా మెరుగైన చికిత్స కోసం రూ.5.50 లక్షల విలువైన
ఎల్ వోసీలను లబ్దిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు దాడి అప్పారావు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, గాలేటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
లబ్దిదారులకు ఎల్ వోసీలు అందజేత
