విజయవాడలో కాస్మోస్ డైమండ్స్ నూతన స్టోర్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెల్లరీ బ్రాండ్ కాస్మోస్ డైమండ్స్ విజయవాడలోని ఎం.జి. రోడ్డులో, బెంజ్ సర్కిల్ సమీపంలో నూతన, విశాలమైన స్టోర్‌ను ప్రారంభించింది. సంస్థ వ్యవస్థాపకురాలు సంజనా త్రిపురమల్లు ఈ స్టోర్‌ను ప్రారంభించారు.
2021లో విజయవాడలో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరుకు విస్తరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా కస్టమర్లకు సేవలందిస్తోంది. నూతన స్టోర్‌లో సంప్రదాయ, ఆధునిక, రోజువారీ, వివాహ వేడుకలకు అనువైన వెయ్యికి పైగా డైమండ్ జ్యువెల్లరీ డిజైన్లు అందుబాటులో ఉంచింది. హాల్‌మార్క్ బంగారు ఆభరణాలు, డైమండ్ సర్టిఫికేషన్‌తో పాటు నిబంధనలకు లోబడి 100 శాతం బైబ్యాక్, ఎక్స్ఛేంజ్ సదుపాయాలను సంస్థ అందిస్తోంది.
కాగా, 2026 జులైలో సంస్థ రూపొందించిన 16.95 క్యారెట్ల బరువున్న 32 ల్యాబ్-గ్రోన్ డైమండ్లతో కూడిన ‘కాస్మిక్ బ్లూమ్’ కళాఖండం స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లింది. నూతన స్టోర్ ప్రారంభంతో విజయవాడలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది.