జిల్లాలో ఆక్వారంగానికి విద్యుత్ పునరుద్ధరీకరణ

-పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి.
-ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి.
-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్నబ్ తుఫాను కారణంగా ఎపిఇపిడిసిఎల్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు.

శుక్రవారం వశిష్ట సమావేశ మందిరంలో ఆక్వా రంగానికి విద్యుత్ పునరుద్దరణ పై ఆక్వా అసోసియేషన్ రైతులు, విద్యుత్, మత్స్య శాఖ అధికారులతో ఎపిఎస్ పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి,
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి సమీక్షించారు.

ఈ సందర్భంగా ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి
మాట్లాడుతూ ఆర్నబ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా ను యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా గృహాలు, ఆక్వా, వ్యవసాయ రంగాలకు సంబందించి విద్యుత్ సరఫరాను పునరుద్దరించటం జరిగిందని అన్నారు. ఇంకా సిబ్బంది, పరికరాలు చేరావేయటానికి ఇబ్బంది కర ప్రాంతాలలో కూడా విద్యుత్ పునరుద్దరణ త్వరలోనే పూర్తి చేయటం జరుగుతుందని అన్నారు..
జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి, గృహ విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు తెలిపారు.

జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన 98 విద్యుత్ ఉపకేంద్రాల్లో పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ప్రభావితమైన 67, 33 కేవీ విద్యుత్ లైన్లలో 66 లైన్లను పునరుద్ధరించగా, మిగిలిన ఒక లైన్ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. అదేవిధంగా 475 ,11 కేవీ విద్యుత్ లైన్లలో 473 లైన్లను పునరుద్ధరించినట్లు తెలిపారు. మిగిలిన రెండు లైన్లను కూడా త్వరలోనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను తొలగించడం, విద్యుత్ లైన్లపై పడిన చెట్లను తొలగించడం, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం వంటి పనులను భారీ స్థాయిలో చేపట్టామన్నారు.

జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ఆరు విభాగాలు, 20 మండలాల్లోని 409 గ్రామాల్లో గృహ విద్యుత్ సరఫరాను 100 శాతం పునరుద్ధరించినట్లు వెల్లడించారు. జిల్లాలో 17,584 ప్రభావిత ఆక్వా విద్యుత్ సర్వీసులకు గాను 16,809 సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని, మిగిలిన 775 ఆక్వా సర్వీసులతో పాటు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు కూడా త్వరలో పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

జిల్లావ్యాప్తంగా 226 బృందాలకు చెందిన 3,254 మంది అధికారులు, విద్యుత్ సిబ్బంది నిరంతరం పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. తుపాను కారణంగా విద్యుత్ రంగానికి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.50.49 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు, సమన్వయ చర్యల కారణంగా ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి గృహ విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించారని సీఎండీ తెలిపారు.

జిల్లాలో ఎక్కడైడా గృహ విద్యుత్ సర్వీసులకు విద్యుత్ సరఫరా లేనట్లయితే సరఫరా పునరుద్ధరణ కోసం వినియోగదారులు కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్లు

– పశ్చిమగోదావరి జిల్లా కాల్ సెంటర్: 9490610152
– భీమవరం డివిజన్: 9493177646
– నరసాపురం డివిజన్: 7382050943
– తాడేపల్లిగూడెం డివిజన్: 9493177806

జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు లేదా ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తితే పై నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని సీఎండీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అర్నబ్ తుపాను ప్రభావానికి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, విద్యుత్, ఇతర శాఖల సమన్వయంతో త్వరితగతిన విద్యుత్ లైన్ల పునరుద్ధరీకరణ చేయటం జరిగిందని తెలిపారు. తుపాను సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది చూపిన సమన్వయం, సమర్థవంతమైన పనితీరు అభినందనీయమని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేశారని అన్నారు.

ఈ సమావేశంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ సూర్య ప్రకాష్, ఎస్ఈ పి ఉషారాణి, ఆక్వా అసోసియేషన్ సభ్యులు, మత్స్యశాఖ డిడి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.