-బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలోని సీతారామపురంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో రఘువంశీ టింబర్ డిపో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుసుకున్న ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన డిపో యజమానులను, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
