– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి వినతి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల కోటాలో గుడివాడ రైతుబజార్లో స్టాలు కేటాయించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను కోరారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం పాత రామాపురానికి చెందిన నత్తా మధు కలిశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ గుడివాడ రైతుబజార్లో స్టాల్ కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. స్టాల్ కేటాయించి …
Read More »Konduri Srinivasa Rao
జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రుల్లో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం జరుగుతుందని, ఈ మేరకు సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, అభివృద్ధి సంఘం …
Read More »చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి…
-తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు -రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : చీకటిని పారదోలుతూ అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగను జాతి, కుల, మత, వర్గ విబేధాలను విస్మరించి సమైక్యంగా …
Read More »బుధవారం నాడు ఎంపిటిసి స్థానాలకు 6, గ్రామ వార్డుకి ఒక నామినేషన్ దాఖలు
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు పరిధిలో ఒక జెడ్పీటిసి, 7 ఎంపిటిసి , 5 గ్రామ పంచాయతీ వార్డులు , కొవ్వూరు పురపాక సంఘం లోని ఒక వార్డు స్థానాల ఎన్నికలకు ఈరోజు నామినేషన్ ల స్వీకారానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈరోజు ఆర్వో లు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్డీవో మల్లిబాబు నామినేషన్లు వివరాలు …
Read More »కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఘాట్లలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో ఎస్. మల్లిబాబు మాట్లాడుతూ, కార్తీక మాసంలో గోదావరి నది లో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు తాకిడిని దృష్టిలో పెట్టుకొని అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ పరిస్థితి నెలకొని, థర్డ్ వేవ్ హెచ్చరికలు చేయడంతో ఎటువంటి …
Read More »కుమారి గెడ్డం స్రవంతి మృతిపై నవంబర్ 5 న విచారణ
-మార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం లో ఉ..10.30 లకు విచారణ -విచారణ కమిటీ కి తగిన వివరాలు, ఆధారాలు అందచెయ్యగలరు -ఆర్డీవో ఎస్. మల్లిబాబు తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు 8వ తరగతి చదువుతున్న గెడ్డం సురేష్ వారి కుమార్తె కుమారి గెడ్డం స్రవంతి ఆక్టోబరు 28 వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగినదని, ఈ విషయమై జిల్లా కలెక్టర్ – పశ్చిమగోదావరి జిల్లా వారు విచారణాధికారిగా …
Read More »దీపావళి షాపుల నిర్వహికులు అగ్నిప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి…
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి షాపుల నిర్వహికులు అగ్నిప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిచాలని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్కృత కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపు లను డిఎస్పీ తో కలిసి ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, దీపావళి పండుగను పురస్కరించుకుని కాలుష్య రహితమైన పర్యావరణానికి చెడు కలుగ చెయ్యానటువంటి దీపావళి సామగ్రి, టపాసులు అమ్ముకునేందుకు అనుమతులు మంజూరు చెయ్యడం జరిగిందన్నారు. ఈ దీపావళి మీ ఇంట ఆనందాన్ని చేకూరాలన్నీ …
Read More »కొవ్వూరు డివిజన్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది…
-బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించారు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థలకు నిర్వహించే ఉప ఎన్నికలకు డివిజన్ స్థాయిలో యంత్రాంగాన్ని సర్వ సన్నద్ధం చెయ్యడం జరిగిందని, బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి చర్యలు చేపట్టారని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ఎన్నికలు ప్రశాంతంగా , శాంతియుతంగా నిర్వహించే విధంగా తహసిల్దార్ లు, ఎంపిడిఓ లు, మునిసిపల్ కమిషనర్, పోలీసు అధికారుల తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం …
Read More »తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయంగా, చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని అభిలషించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా ఆనంద …
Read More »కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నమచ్చా రామలింగ రెడ్డి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి ఫై వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గ అమ్మవారిని APWJU రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగ రెడ్డి దర్శించుకున్నారు. దుర్గగుడి సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దేవాలయం లో ఆయనను వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపిఆశీర్వదించారు. అనంతరం మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు సోదరులు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, కరోనా బారిన ఈ ఒక్క జర్నలిస్టు పడకూడదని అమ్మవారిని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో APWJU …
Read More »