Breaking News

Konduri Srinivasa Rao

6న స్పందన… : కమీషనర్ ప్రసన్న వెంకటేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజల సమస్యల పరిష్కార వేదికగా సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యం, సర్కిల్ కార్యాలయములలో “స్పందన” కార్యక్రమము జరుగుతుందని కమిషనర్ ప్రకటన ద్వారా తెలిపారు. 06.09.2021 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయం, మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వ‌హించ‌బ‌డుతుంద‌న్నారు.

Read More »

భార‌తీయ ప‌రిశోధ‌న రంగానికి గురువులే మార్గ‌ద‌ర్శ‌కులు…

-ఆంధ్ర‌ప్ర‌దేశ్ విట్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ ఎస్‌.వి.కోటారెడ్డి -80 మంది ఉత్త‌మ ఉపాధ్యాయుల‌కు స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ బెస్ట్ టీచ‌ర్ పేరుతో పుర‌స్కారాలు అంద‌జేత‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భార‌తీయ ప‌రిశోధ‌నా రంగానికి గురువులే మార్గ‌ద‌ర్శ‌కుల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ విట్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ ఎస్‌.వి.కోటారెడ్డి అన్నారు. ప్ర‌పంచాన్ని నడిపిస్తున్న శాస్త్ర సాంకేతిక రంగాల‌లో వ‌స్తున్న మార్పుల‌పై విద్యార్థుల‌ను సిద్ధం చేస్తున్న గురువుల పాత్ర స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించి గ‌ర్వించాల్సిన స‌మ‌యం అని ఆయ‌న పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని …

Read More »

విలువలతో కూడిన జర్నలిజానికి పాటుపడిన వర మోహన్ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విలువలతో కూడిన జర్నలిజానికి వర మోహన్ పాటుపడ్డారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శాంతినగర్ ప్రాంతంలో శ్రీ ఐతా రాములు ఎలిమెంటరీ పాఠశాల ఆవరణలో విలేఖరి పరుచూరి వర మోహన్ (బాబి) సంతాప సభ ఆదివారం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని వరమోహన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాత్రికేయుడుగా వరమోహన్ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు అంబటి ఆంజనేయులు, …

Read More »

వైసీపీ ప్రభుత్వ హయాంలో శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలుపెట్టిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తూ అభివృద్ధి లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ లలో దాదాపు 30లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే రోడ్డు నిర్మాణలకు నగర మేయర్ రాయన …

Read More »

2023 మార్చి నాటికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు,భూరక్ష పధకం పూర్తి…

-ఈనెల 16న మరోసారి మంత్రి వర్గ ఉప సంఘ సమావేశం -భూవివాదాల సత్వర పరిష్కారంపై మంత్రివర్గ ఉప సంఘం ప్రత్యేక దృష్టి -ఈపధకం పూర్తయితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది -పంచాయితీరాజ్ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే 2023 మార్చి నాటికి వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పధకాన్ని పూర్తిగా అమలుచేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు.ఈమేరకు శనివారం అమరావతి సచివాలయంలో …

Read More »

భారతదేశ 75 వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఫిక్కీ భువనేశ్వర్ శాఖ నిర్వహించిన వెబినార్‌లో పాల్గొన్న గవర్నర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో కేంద్ర స్థాయిలో పైక్ తిరుగుబాటు గుర్తింపు పొందిందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య వేడుకను పురస్కరించుకుని ఫిక్కీ భువనేశ్వర్ (ఎఫ్ఎల్ఓ) శాఖ నిర్వహించిన వెబినార్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శనివారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్‌లో గవర్నర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా బుక్సి జగబంధు నేతృత్వంలో పైక్ తిరుగుబాటుకు …

Read More »

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వ భూషణ్ హరిచందన్ వారి సందేశం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులందరికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శప్రాయమైన విద్యావేత్త, పండితుడు, తత్వవేత్త, రచయిత. జీవితంలో ఉన్నత నైతిక విలువలను అలవర్చే ఉపాధ్యాయులు మన సమాజానికి వాస్తుశిల్పులు. వారు దేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారి సహకారం లేకుండా, ఏ సమాజమూ ప్రగతిశీల …

Read More »

టోక్యో పారాలింపిక్స్‌ పతక విజేతలకు గవర్నర్ అభినందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టోక్యో పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతక విజేత మనీష్ నర్వాల్ , రజత పతక విజేత సింఘ్రాజ్ అధనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖారాను అభినందించిన గవర్నర్ ఆమె ఇప్పటికే ఒక బంగారు పతకాన్ని సాధించారని ప్రస్తుతించారు. పారాలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారని గౌరవ గవర్నర్ …

Read More »

గవర్నర్‌తో భేటీ అయిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో శనివారం రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. తొలుత రాజ్‌ భవన్‌కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ (ముంబై) అగస్ పి. సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా …

Read More »

సచివాలయంలో ఎపిఎండిసి పై సమీక్షా సమావేశం…

– ఎపిఎండిసి కార్యకలాపాలను సమీక్షించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంస్థ చైర్ పర్సన్  షమీమ్ అస్లాం – సమీక్షలో పాల్గొన్న గనులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి&ఎండి విజి వెంకటరెడ్డి, సంస్థ సలహాదారు డిఎల్ఆర్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ చైర్ పర్సన్  షమీమ్ అస్లాం ఆధ్వర్యంలో సమీక్ష …

Read More »