విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదలుపెట్టిన ప్రతి పనిని శరవేగంగా పూర్తి చేస్తూ అభివృద్ధి లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ లలో దాదాపు 30లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించబోయే రోడ్డు నిర్మాణలకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పూజ కార్యక్రమలు నిర్వహించారు. తదనంతరం ఇదే డివిజన్ లో దాదాపు కోటి 20లక్షల రూపాయల నిధులతో నిర్మాణలు పూర్తి చేసుకున్న పలు రోడ్లు ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కాలనీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చొరవతో ఈ ఒక్క డివిజన్ లోనే దాదాపు 10కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో అభివృద్ధి పట్టించుకోనేవారి కాదు అని, కానీ జగన్ రాష్ట్రం అంత సమ అభివృద్ధి చెందలని ఓడిపోయిన సరే తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసారని,రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉండాలని ప్రజలు అంత కోరుకొంటున్నారని కొనియాడారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ ఉండి కూడా గత 5 సంవత్సరాలు ఈ డివిజిన్ అభివృద్ధి ని పట్టించుకోలేదని,ఇప్పుడు వచ్చి వైసీపీ ప్రభుత్వం పూర్తి చేసిన పనుల వద్ద ఫోటోలు దిగి వారి ఘనత గా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. ప్రజలు అంత గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో మీకు గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ డిప్యూటీ మేయర్ కో ఆప్షన్ సభ్యుడు ముసునూరి సుబ్బారావు, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావు, ఎన్టీఆర్ కాలనీ అధ్యక్షలు సుంకర రాజేష్, వెటర్నటీ కాలనీ అధ్యక్షలు సుబ్బారావు, కాలనీల పెద్దలు రామకోటేశ్వరావు, బాపయ్య చౌదరి, విజయ్ కుమార్, శివరామా ప్రసాద్ మరియు కాలనీ వాసులు, అధికారులు పాల్గొన్నారు.
