– జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 123 అర్జీలు. – జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, సత్వర పరిష్కారానికి అధికారులు కృషిచేయాలని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా.. డీఆర్‌వో ఎం.లక్ష్మీ …
Read More »All News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ కు బందర్ రోడ్డులోని ఆయన క్యాంపు కార్యాలయంలో బడ్జెట్ పత్రాలను అందజేస్తున్న ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, సెక్రటరీ (ఎక్స్పెండిచర్) ఎం.జానకి, అడిషనల్ సెక్రటరీ జె.నివాస్. పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
Read More »ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వతంత్ర భారతదేశం తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మౌలానా ఆజాద్ రాజకీయ రంగంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని అన్నారు..విద్యావ్యవస్థ పటిష్టతకు,ప్రాథమిక విద్యను ప్రోత్సహించారు అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ లకు ఎంతగానో …
Read More »పరమపవిత్రం కార్తీక మాసం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక సోమవారంను పురస్కరించుకుని గవర్నర్ పేటలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాంత్రిక జీవనంలో కార్తీకమాసం కొత్త శోభను తీసుకువస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ మాసంలో ఆచరించే దీపారాధనలు, ఉపవాస దీక్షలు, కార్తీక పురాణ పఠనం, నదీ హారతి, జ్వాలాతోరణం జన్మజన్మల …
Read More »గుణాత్మక విద్యకు మార్గదర్శి మౌలానా అబుల్ కలాం ఆజాద్
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన తొలి బాటసారి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సోమవారం ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం …
Read More »విధి నిర్వహణలో ఉన్న పోలీసులను బెదిరిస్తే కఠిన చర్యలు
-అధికారులకి ఎలాంటి అపాయం జరిగినా బెదిరించిన వారిదే బాధ్యత -ఐపీఎస్ అధికారులు లక్ష్యంగా గత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదు -ఇంకోసారి ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే సమోటోగా కేసులు -గత ముఖ్యమంత్రి పర్యటనల్లో చెట్ల నరికివేతపై వాల్టా చట్టం కింద చర్యలు -అటవీ అమర వీరుల త్యాగాలు వృథా కానివ్వం -భావితరాలు గుర్తుంచుకునేలా విగ్రహాల ఏర్పాటు… భవనాలకు అమర వీరుల పేర్లు -గుంటూరు అరణ్యభవన్ లో జరిగిన అటవీ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ …
Read More »పవన్ కళ్యాణ్ తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారికి వివరించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో దాదాపు రెండున్నర గంటల సేపు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సమావేశమైన సమావేశంలో అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ కి కి గ్రామపంచాయతీలు మరియు గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దాదాపు 26 డిమాండ్లను వారి …
Read More »రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీకి వర్ష ముప్పు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Read More »అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీం జీవోను అమలు చేయాలి
-APUWJ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టుల హౌసింగ్ స్కీం విషయంలో గతంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ పేరిట ఇచ్చిన జీవోను పునరుద్ధరించాలని ఏపీయుడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఏపీయుడబ్ల్యూజె విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం ఆదివారం అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు పాల్గొని కొత్త అక్రెడిటేషన్లు, జర్నలిస్టుల హౌసింగ్ స్కీం తదితర …
Read More »ప్రి రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎంపికైన ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 12 నుండి 21 వరకు జరిగే ప్రి రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కొల్లేటి రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ కంటేజెంట్ లీడర్ గా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఎన్ఎస్ఎస్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ ఉత్తర్వులు పంపారు. ఈ సంవత్సరం జరిగే ప్రి రిపబ్లిక్ డే …
Read More »