Breaking News

All News

మంత్రి జనార్ధన్ రెడ్డిని కలిసిన ఏపీఎస్ఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రివర్యులు  బీసీ జనార్ధన్ రెడ్డిని సచివాలయంలోని తన కార్యాలయంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎం.డీ(మేనేజింగ్ డైరెక్టర్) దినేష్ కుమార్,ఐఏఎస్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పూలమొక్కను మంత్రికి అందించికి అభినందనలు తెలియజేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ లో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై మంత్రి దినేష్ కుమార్ కు పలు సూచనలు చేశారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్ ను తన జేబు సంస్థగా వాడుకుని, ప్రజాధనాన్ని దోపిడీ చేసిందని మంత్రి తెలిపారు. …

Read More »

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయండి

-వాడవాడలా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలి -స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వాతంత్ర్య సమరయోధులను సత్కరించండి -జిల్లాల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతాకను ఎగురవేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పిలుపు నిచ్చారు.హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమంపై బుధవారం విజయవాడ సిఎస్ …

Read More »

హజ్ యాత్ర -2025 కు దరఖాస్తు చేసుకోండి

-దరఖాస్తులన్నీ ఆన్లైన్ లోనే స్వీకరణ -సెప్టెంబర్ 9వ తేదీ వరకు గడువు -ఏపీ మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్ర కోసం హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్-2025 కు ఆన్‌లైన్ దరఖాస్తు నమోదును ఈనెల 13వ తేదీ నుండి ప్రారంభించిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ,న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు.హజ్ దరఖాస్తుల ఫారమ్‌లను పూరించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 9వ తేదీ వరకు కేంద్ర …

Read More »

తీరనున్న బందరు వాసుల చిరకాల కోరిక

-మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైన్‌కు మార్గం సుగమం -దశాబ్దాల బందరు వాసుల ఆకాంక్షలను నెరవేర్చండి -ప్రజా రవాణాతో పాటు వాణిజ్య పరంగానూ లాభసాటిగా ఉంటుంది -రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి కొల్లు రవీంద్ర వినతి న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ప్రజల దశాబ్డాల కోరిక అయినటువంటి మచిలీపట్నం – రేపల్లె మధ్య 45 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను పూర్తి చేయాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ …

Read More »

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని కలిసిన డ్రోన్ కంపెనీ యజమానులు

– ప్రభుత్వశాఖల్లో డ్రోన్ టెక్నాలజీపై మంత్రికి వివరణ – ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పిన మంత్రి జనార్ధన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ రంగంలోని రోడ్లు మరియు భవనాల శాఖ మరియు పారిశుధ్య నిర్వహణ, తదితర విషయాల్లో డ్రోన్ టెక్నాలజీ వల్ల ఉన్న ఉపయోగాలను డ్రోన్ కంపెనీల యజమానులు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డికి సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం కలిసి వివరించారు. హైదరాబాద్ కు చెందిన WINGS & …

Read More »

బాలికను రక్షిద్దాం.. బాలికను చదివిద్దాం

-మహిళలను గౌరవించడం  ఇంటి నుంచే ప్రారంభం కావాలి. -మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి చెందుతుంది. -జిల్లాలోని ప్రతి అంగన్వాడి కేంద్రానికి ఇండక్షన్ స్టావ్ లను అందజేస్తా.. – మహిళల కొరకు ప్రవేశపెట్టే కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి -బేటి బచావో బేటి బడావో జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న… -ఎంపీ. దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలను గౌరవించడం  ఇంటి నుంచే ప్రారంభం కావాలని, మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి …

Read More »

జేసీగా చిన రాముడు బుధవారం బాధ్యతలు స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బాధ్యతలను స్వీకరించారు. తొలిగా స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ను అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి , జాయింట్ కలెక్టర్ చిన రాముడు తో జిల్లాలోని ప్రాధాన్యత అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం చేరుకున్న చిన రాముడు జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో …

Read More »

కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  స్థానిక శ్రీ వేంకటేశ్వర మార్కెట్ నందు తూర్పు గోదావరి జిల్లా కార్మిక శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కార్మికులకు వారి హక్కులు గురించి వివరించారు. వారి సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న పథకాలు, న్యాయ సేవల గురించి తెలిపారు. నల్సా వారి “అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ …

Read More »

గోదావరీ పుష్కర్ ఘట్ లో వేడుకగా గోదావరి హారతి , జెండా పండగ ప్రదర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అజాధికా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగ జెండా కార్యక్రమంలో భాగంగా గోదావరీ నది ఒడ్డున గోదావరీ హారతి కార్యక్రమం, జాతీయ జెండా పండుగలో లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొన్నారు. అజాధికా అమృత్ ఉత్సవ్ వేడుకల్లో భాగంగా బుధవారం పర్యాటక, దేవదాయ , మత్స్య శాఖ, ఆర్ ఎం సీ అధ్వర్యంలో పుష్కరఘట్ వద్ద సాంసృతిక, ఆధ్యాత్మిక, జాతీయ జెండా ప్రదర్శన, మత్స్య కారులు ప్రదర్శన లు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలి

-జిల్లా ఉపాధి కల్పనాధికారి డి.విక్టర్ బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఆగస్టు 14 న తేదీ అనగా బుధవారం నాడు విజయవాడలో ఎంప్లాయేంట్ ఎక్సేంజ్ నందు మినీ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి. విక్టర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా విక్టర్ బాబు మాట్లాడుతూ అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం …

Read More »