విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ ప్రతి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయని,వాటి ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి గడప వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని రాజరాజేశ్వరి కళ్యాణమండపంలో జరిగిన 11,12,13,14,15 డివిజన్ల సచివాలయ వాలంటీర్ ల ఉగాది పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ …
Read More »Andhra Pradesh
జిల్లాలో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి జనన ధృవీకరణ కుల ధ్రువీకరణ పత్రాల జారీ లక్ష్యం
-ఇందుకోసం కార్యాచరణ రూపొందించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ -వచ్చే నెల నుండి జిల్లాలో గ్రామదర్శిని పక్కాగా అమలుకు చర్యలు -రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని అమలుచేయాలి -రెవెన్యూ అధికారులకు సూచించిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మంగళవారం కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లాలో అందరు ఆర్డీవోలు తాసిల్దార్లు, హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు గృహనిర్మాణం, ఓ …
Read More »మహావీర్ జయంతి సందర్భంగా 14న మాంసం విక్రయాలు బంద్
-కబేళ మూసివేత- నిభందనలు ఉల్లగించిన వారిపై చర్యలు -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఉత్తర్వులు ననుసరించి ది. 14-04-2022 మహావీర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని అన్ని చికెన్, మటన్ షాపులు మరియు చేపల మార్కెట్లు అన్నింటికి సెలవు ప్రకటించడమైనది. నగరంలో ఉన్న కబేళ కు కూడా సెలవు ప్రకటించడమైనది. ఎవరైనా నిభందనలను పాటించకుండా షాపులు తీసి వ్యాపారం చేసిన యెడల చట్ట ప్రకారం కమిషనర్ …
Read More »గుంటతిప్ప మరియు పుల్లేటి డ్రెయిన్ల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు
-మురుగునీటి పారుదల సక్రమముగా పారేలా చర్యలు చేపట్టాలి -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పర్యటనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి గుంటతిప్ప డ్రెయిన్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. కానూరు శ్రీ శక్తీ ఫంక్షన్ హాల్ నుండి రైవస్ కాలువ వరకు గల మేజర్ అవుట్ ఫాల్ డ్రెయిన్ నందలి మురుగునీటి పారుదల విధానమును పరిశీలిస్తూ, మురుగునీటి పారుదలకు అవరోధకరంగా డ్రెయిన్ నందు పేరుకుపోయిన …
Read More »రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పినిపె విశ్వరూప్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పినిపె విశ్వరూప్ మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో కేటాయించిన ఛాంబరుకు సతీసమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఛాంబరులో వేదమంత్రాల మధ్య షోడషోపచారలతో మంత్రి దంపతులు ఘనంగా పూజనిర్వహించిన తదుపరి మంత్రి ఆసీనులు అయ్యారు. అనంతరం రవాణా శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులతో పలువురు అధికారులు, అనధికారులు …
Read More »మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్, పర్యావరణం, అటవీ, సైన్స్ & టెక్నాలజీ, గనులశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సచివాలయంలోని మూడో బ్లాక్ లో మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అంతకమందు సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పెద్దిరెడ్డి దంపతులు, ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, గనులు, పర్యావరణం, విద్యుత్, సైన్స్ & టెక్నాలజీ శాఖకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ …
Read More »శ్రీకాకుళం రైలు ప్రమాద బాధితులను ఆదుకోండి…
-పరాయి రాష్ట్రం వారైనా మానవతా దృక్పథాన్ని చూపండి -మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం -అధికారులకు ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లాకలెక్టర్ నివేదించిన తాజా వివరాలను ముఖ్యమంతి కార్యాలయ కార్యదర్శి– సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో 5గురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని …
Read More »వైసీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న మహిళలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం గడప గడపకు …
Read More »బెంజ్ సర్కిల్ ని కాకాని సర్కిల్ గా మార్చండి…
-కాకాని వెంకట రత్నం విగ్రహ పునరుద్ధరణకు డిమాండు -కలెక్టర్ ఢిల్లీరావుకు కాకాని ఆశయ సాధన సమితి వినతి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ సర్కిల్లో కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని పునరుద్ధరించాలని కాకాని ఆశయ సాధన సమితి డిమాండు చేసింది. కొత్తగా ఏర్పాటయిన ఎన్.టి.ఆర్. జిల్లాకు మకుటాయమానంగా నిలిచే ఆంధ్ర ఉక్కు మనిషి, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షుడు తరుణ్ కాకాని కోరారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును కలెక్టరేట్ …
Read More »25 మందితో కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో 25మందితో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువు దీరింది. సోమవారం అమరావతి సచివాలయంను ఆనుకుని ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 25 మంది కొత్త మంత్రులతో ఉ.11.31 గం.లకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఉ.11.30గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు వేదికపైకి చేరుకున్నారు. తదుపరి పోలీస్ బ్యాండ్ …
Read More »