Andhra Pradesh

జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇంతవరకు 6 లక్షల లీటర్ల పాలను సేకరించాం: జేసీ. డా.కె.మాధవిలత

-మరో 30 గ్రామాలలో నేటినుండి పాలసేకరణ ప్రారంభించిన జేసీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద జిల్లాలో ఇంత వరకు ఆరు లక్షల లీటర్ల పాల సేకరణ చేసి, 3 కోట్ల రూపాయలకు పైగా పాడి రైతులకు చెల్లించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ మాధవిలత చెప్పారు. జిల్లాలో అదనంగా మరో 30 గ్రామాలలో జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని బుధవారం విజయవాడలోని జగనన్న పాలవెల్లువ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుండి జెసి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జేసీ …

Read More »

జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు

– పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: * ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి : జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జి.కొండూరు మండలం కవులూరు లోని అర్బన్ లే అవుట్ పనులను అధికారులతో కలిసి జేసీ బుధవారం …

Read More »

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ని కలిసిన ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏయిమ్స్ డైరెక్టర్ & సీఈవో ప్రొ. ముకేశ్ త్రిపాఠి, ఇతర సీనియర్ అధికారులు ఇవాళ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని న్యూఢిల్లీలోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరి ఏయిమ్స్ సాధిస్తున్న ప్రగతిని ఉపరాష్ట్రపతికి వివరించారు. వివిధ విభాగాల పురోగతిని ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

Read More »

నిర్దేశిత ఎం ఆర్ పి ధరలకే వంటనూనెలను విక్రయించాలి…

-నగరంలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు …

Read More »

కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదు… : నగరి ఎమ్మెల్యే రోజా

– మచిలీపట్నం లో ముగిసిన క్రీడాసంబరం -వైఎస్సార్ – పి కె ఎం కప్ సీజన్ – 2 క్రికెట్ టోర్నమెంటు -ముగింపుకార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా -క్రికెట్ టోర్నీ విజేత ఆరెంజ్ ఆర్మీ -రన్నర్స్గా హుస్సేనీ ఎలెవన్ జట్టు -12 రోజుల పాటు సాగిన క్రికెట్ సంబరం -48 జట్లు.. 500 మంది క్రీడాకారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదని ఇంత చిన్న భుజాలపై ఎంతో పెద్ద క్రికెట్ టోర్నమెంట్ భారాన్ని మనోస్థైర్యం, …

Read More »

సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉంది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉందని కథ, నవల, వ్యాసం, కవిత, ఇలా అన్ని ప్రక్రియలను చదివి వాటిలోని మానవీయ విలువలను అవగాహన చేసుకున్ననాడు మరిన్ని మంచి రచనలు వెలువడడానికి ఆస్కారం ఉందని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కృషిచేసి మన తెలుగుభాష గొప్పదనాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తిచేయాలని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. …

Read More »

సకల సదుపాయాల కల్పవల్లి.. మెగా ఫుడ్ పార్క్ @ మల్లవల్లి

-పారిశ్రామిక కల్పతరువు.. పెట్టుబడిదారుల కామధేనువు -రూ.86కోట్లతో 7.48 ఎకరాలలో భారీ ‘కోర్ ప్రాసెసింగ్‌ సెంటర్‌’ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి -ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రోడ్ షో : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -ఫుడ్ పార్కుల ద్వారా రూ. 260కోట్ల పెట్టుబడులు, 6 వేల మందికి ఉపాధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అందుబాటులోకి కృష్ణాజిల్లా మల్లవల్లి మెగాఫుడ్‌ పార్కును రానున్న మామిడి పళ్ల సీజన్‌ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల కల్పన …

Read More »

షరతులకు లోబడితేనే రూసా నిధులు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ ఉచ్ఛతార్‌ శిక్ష అభియాన్‌ (రూసా) అని విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సుభాస్‌ సర్కార్‌ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రూసా నిధులకు రాష్ట్రాల వాటాను సకాలంలో జమ చేయడం అంతకు ముందు విడుదల చేసిన నిధులలో 75 శాతం నిధులు ఖర్చు చేయడం వంటి కొన్ని షరతులకు లోబడి …

Read More »

విశాఖ లాజిస్టిక్ పార్క్ ప్రతిపాదనల్లో పురోగతి

-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ప్రతిపాదన పురోగతిలో ఉన్నట్లు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభకు తెలిపారు. వైస్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ భారత్‌మాల పరియోజనలో భాగంగా దేశంలో 35 ప్రాంతాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినట్లు మంత్రి చెప్పారు. అలా ఎంపిక చేసిన 35 ప్రాంతాల్లో విశాఖపట్నం …

Read More »

విజయవంతమైన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాల

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర సంఘటన్ గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భముగా హిందీ భాష లో వకృత్వ పోటీలు, క్విజ్ కాంపిటేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ మరియు రాష్ట్రస్థాయిలో నెహ్రు యువకేంద్ర సిబ్బందికి వెబినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు …

Read More »