Andhra Pradesh

జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇంతవరకు 2. 65 లక్షల లీటర్లు సేకరించాం…

-పాడి రైతులకు 2. 60 కోట్ల రూపాయలు చెల్లించాం  -ఇదే స్పూర్తితో మూడో ఫేజ్ గ్రామాలలో పాల సేకరణ జరగాలి : మండల అధికారులకు కలెక్టర్ జె. నివాస్ ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఇంతవరకు 2. 65 లక్షల లీటర్లు సేకరించి, 2. 60 కోట్ల రూపాయలు పాడి రైతులకు చెల్లించామని, ఇదే స్పూర్తితో మూడో ఫేజ్ మండలాల్లో కూడా జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కలెక్టర్ జె. …

Read More »

స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోనే పరిష్కరించాలి…

-దరఖాస్తుల పరిష్కారంలో నాణ్యత ముఖ్యమైనది : సక్రమంగా పరిష్కరించని అధికారులపై చర్యలు -పని అడిగిన ప్రతీ కూలీకి 100 రోజుల పాటు పని కల్పించాలి -అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాదించాల్సిందే : డివిజన్ సమీక్షలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్  గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించడంతోపాటు, నాణ్యమైన రీతిలో పరిష్కారాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక కె కన్వెన్షన్ హాలులో బుధవారం …

Read More »

సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించాలి : జిల్లా కలెక్టర్ జె. నివాస్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గుడివాడ పట్టణంలోని 17వ వార్డ్ సచివాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆకస్మికంగా సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డ్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించి ప్రభుత్వ ఆశయం మేరకు పనిచేయాలన్నారు. ప్రభుత్వం …

Read More »

విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని సబ్ కలెక్టర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ అన్నారు. బుధవారం సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ నగరంలోని పాత, కొత్త ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావాలని, గైర్హాజరైతే చర్యలు తప్పవన్నారు. పేద ప్రజలు …

Read More »

మహిళా చైతన్యానికి ‘సబల’

-మహిళా కమిషన్ కార్యచరణ విడుదల -క్షేత్రస్థాయిలో విస్తృతంగా కార్యక్రమాలు: ‘వాసిరెడ్డి పద్మ’ వెల్లడి -‘సబల’ అజెండాగా సాగిన త్రైమాసిక సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సమస్యలపై తక్షణమే స్పందించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ఏడాది కార్యచరణను విడుదల చేసింది. ‘సబల’ – ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్రవ్యాప్తంగా కమిషన్ కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అధ్యక్షతన కమిషన్ సభ్యులతో త్రైమాసిక సమావేశం నిర్వహించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న …

Read More »

చేనేత జౌళి శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరణ…

-చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ కే. శ్రీకాంత్ ప్రభాకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చేనేత మరియు జౌళి శాఖలో ” టెక్స్ట్ టైల్స్ డిజైనర్, క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ ” లుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నామని చేనేత జౌళి శాఖ అడిషనల్ డైరెక్టర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకం క్రింద ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో క్లస్టర్ డెవలప్ …

Read More »

విద్యా దీవెన నాల్గో విడత భోధనా రుసుము ఈనెలలోనే విడుదల చేస్తాం

-రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న విద్యా దీవెన పథకం క్రింద పూర్తి స్థాయిలో బోధనా రుసుమును ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటు వంటి ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ చైర్మన్ కె.హేమ చంద్రా రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ఏడాది అక్టోబరు, నవంబరు, డిశంబరు త్రైమాసికానికి చెందిన జగనన్న విద్యా దీవెన నాల్గో విడత బోధనా రుసుమును ప్రస్తుతం జరుగుచున్న అసెంబ్లీ సమావేశాల తదుపరి ఈ …

Read More »

నగరంలో నూతనంగా ప్రారంభమైన రమ ఫ్యాబ్రిక్స్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ, బందర్‌రోడ్డులోని బృందావన్‌ కాలనీలో నూతనంగా రమ ఫ్యాబ్రిక్స్‌ అనే నూతన స్టోర్స్‌ను సంస్థ అధినేత హరీష్‌ కమల్‌ మార్చి 9న ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌ కమల్‌ మాట్లాడుతూ ఇది ఎక్స్‌క్లూజివ్‌ ఫ్యాబ్రిక్స్‌ స్టోర్‌ అని, కస్టమర్స్‌ దేవుళ్ళ ఎక్స్‌పీరియన్సే మోటాగా ఈ సంస్థ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ స్టోర్స్‌లో ప్రత్యేకత ఏమిటంటే అన్ని స్టోర్స్‌కంటే డిఫరెంట్‌గా దీనిలో కస్టమర్సే తమంతట తామే నేరుగా సెలక్షన్స్‌ చేసుకునే విధంగా డిజైన్‌ చేశామని, అలాగే ఇంటీరియల్స్‌ …

Read More »

అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలి

-శ్రీశ్రీశ్రీ గంగానమ్మ దేవస్థాన వార్షిక మహోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరం అయోధ్య నగర్లోని శ్రీ శ్రీ శ్రీ గంగానమ్మ దేవస్థానం 7వ వార్షికోత్సవ మహోత్సవం బుధవారం కన్నులపండువగా జరిగింది. అమ్మవారికి ఉదయం మూల మంత్రాలతో అర్చన, అభిషేకములు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు కార్యక్రమం మేళతాళాల నడుమ వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు

-తమ సమస్యలపై ఎమ్మెల్యేకు మెమోరెండం అందజేత -సమస్య పరిష్కారంపై పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడటంపై హర్షం వ్యక్తం చేసిన టీచర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చిన నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయులు ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఎక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను అదే ప్రాంతాలలో అవకాశం లభిస్తుందని ఆశించిన ఉపాధ్యాయులను దూర ప్రాంతాలలో 3, 4 కేటగిరీలలో చూపడంతో తామంతా …

Read More »