Andhra Pradesh

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట… : తాతినేని పద్మావతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం పైగా రిజర్వేషన్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్నారన్నారని, మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుదలకు పురుషులు సహకరించాలని తాతినేని పద్మావతి ఛైర్‌పర్సన్‌, ఎపిఎస్‌ఆర్‌టిసి విజయవాడ రీజియన్‌ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తమ చాంబర్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టి.పద్మావతి మాట్లాడుతూ కుటుంబంలో మహిళ దిక్సూచిగా వ్యవహరిస్తుందని, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది తద్వారా …

Read More »

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు….

-మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట -ప్రతి సోమవారం జడ్పీ లో అందరికీ అందుబాటులో ఉంటా -మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్ పర్సన్ మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక సోమవారం జడ్పీ లో తమ చాంబర్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మహిళలు …

Read More »

ప్రభుత్వ పాఠశాలలకు పునర్జీవం వచ్చింది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలలకు పునర్జీవం వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు పరుగులు పెడుతున్నారని అన్ని సౌకర్యాలూ ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతూ సైతం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు …

Read More »

“ఎప్పుడైతే అన్ని రంగాలలో మహిళలు ముందు ఉంటారో అప్పుడు  దేశం ముందుకు సాగుతుంది…”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : “ఎప్పుడైతే అన్ని రంగాలలో మహిళలు ముందు ఉంటారో అప్పుడు  దేశం ముందుకు సాగుతుంది” అని ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్ వ్యవస్థాపకుడు/చైర్మన్ అరవింద్ అరసవిల్లి అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేసారు. అరవింద్ అరసవిల్లి మాట్లాడుతూ మహిళా సాధికారత అంటే సంక్షోభ సమయంలో అనేక విధాలుగా మహిళల్లో అంతులేని శక్తిని మరియు ధైర్యాన్ని పెంపొందింపచేయడమన్నారు. ఎక్సెల్ల ఎడ్యుకేషన్ గ్రూప్‌లో మహిళలు స్వేచ్ఛను ఆస్వాదిస్తారు మరియు వారి నిర్ణయాలను స్వేచ్చగా వెల్లడిస్తారు. ఎందుకంటే వారి జీవితానికి మరియు …

Read More »

ఘనంగా క్యారమ్స్‌ ర్యాంకింగ్‌ టోర్నీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క్యారమ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌, కౌతాపూర్ణానంద సత్రంలో ఆదివారం రెండవ రోజు రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్‌ పోటీలు కొనసాగాయి. మహిళల విభాగంలో ఆర్‌.వినీత (నెల్లూరు), విజేతగా నిలవగా, రెండు, మూడు స్థానాల్లో ఎల్‌.హరిప్రియ, ఎం.ఎస్‌.హారిక (విశాఖపట్నం), నిలిచారు. పురుషుల విభాగంలో ఎ.రాజా, అజయ్‌కుమార్‌ (గుంటూరు), వై.ఎస్‌.డి.రమేష్‌, జనార్థనరెడ్డి (విశాఖపట్నం), వి.శ్రీనివాసరావు, ఎ.మనోహర్‌, ఎం.బద్రి (కృష్ణా), ఎ.కె.బషీర్‌ (ప్రకాశం) క్వార్టర్స్‌ ఫైనల్స్‌కు చేరారు. పోటీలను జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి జె.మురళీకృష్ణ, కోశాధికారి ఎం.హరిబాబు పర్యవేక్షించారు.

Read More »

ఎపిజిఇఎస్‌ఎ ఆధ్వర్యంలో ‘బ్లాక్‌ డే’ నిరసన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉద్యోగుల 11వ పిఆర్‌సిలో ఉద్యోగ సంఘ నాయకులు సాధించిన విజయాలను నేటికీ బహిరంగంగా చెప్పకపోవడం శోచనీయమని, ఆ విజయాలను గురించి వెంటనే ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ లోకానికి తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ (ఎపిజిఇఎస్‌ఎ) రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావులు అన్నారు. ఆదివారం బందరురోడ్డులోని వారి కార్యాలయంలో ‘బ్లాక్‌ డే’ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వినుకొండ రాజారావు, కొండపల్లి శ్రీనివాసరావులు …

Read More »

శాంతి కపోతాలను చంపకండి…

-స్సామ్నా రాష్ట్ర ప్రధమమహాసభలో ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాంతి కపోతాలుగా ఉన్న చిన్న పత్రికలను చంపొద్దని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి హితవుపలికారు. స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు అధ్యక్షతన విజయవాడలో ఆదివారం జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎన్నో రకాల పక్షులు ఉంటాయని వాటిలో శాంతి కపోతాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే స్థానిక పత్రికలు అనేవి శాంతి కపోతాలు వంటివే అని చెప్పారు. కేవలం …

Read More »

అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రీ ఉమా కాటకూటేశ్వర లింగేశ్వర స్వామి ఆలయ 59 వ వార్షికోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథ్ రాజు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ శివాలయంలో జరిగే వార్షికోత్సవాల్లో స్వంత ఖర్చులతో అన్నదానం నిర్వహించడం జరుగుతోందన్నారు. 59 వ వార్షికోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా తన వంతుగా ఈరోజు …

Read More »

శాసన సభ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ హాజరు పై ట్రైయల్ రన్

-తొలిసారి సభలో ప్రత్యక్షంగా ప్రసంగించనున్న బిశ్వభూషణ్ హరిచందన్ -ముందస్తుగా కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించిన ఆర్ పి సిసోడియా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా  బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శాసనసభకు హాజరు కానున్నారు. కరోనా నేపధ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆన్ లైన్ విధానంలో ఉభయసభలను …

Read More »

వచ్చే మార్చి నాటికీ రోజుకి 240 మిలియన్ యూనిట్లకు చేరనున్న విద్యుత్ డిమాండ్

-వేసవిలో 24x 7 విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి -డిమాండ్ ఎంత పెరిగిన సరఫరాకు ఢోకా ఉండదు -వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ పై స్పెషల్ ఫోకస్ -అవాంతరాలు లేని విద్యుత్ సరఫరాయే లక్ష్యం -డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్ల నిర్వహణ పై నిరంతర పర్యవేక్షణ -ఈ ఏడాది ఏప్రిల్ నాటికి విద్యుత్ డిమాండ్ రోజుకు 222.8 మిలియన్ యూనిట్లకు చేరవచ్చని అంచనా -మార్చి నుంచి మే నెలల మధ్య విద్యుత్ డిమాండు 20,143 మిలియన్ యూనిట్ల అంచనా -ప్రతి గృహానికి, …

Read More »