Breaking News

అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం…

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నీ దానాల్లో అన్నదానానికి ప్రత్యేక స్థానం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రీ ఉమా కాటకూటేశ్వర లింగేశ్వర స్వామి ఆలయ 59 వ వార్షికోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథ్ రాజు మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ శివాలయంలో జరిగే వార్షికోత్సవాల్లో స్వంత ఖర్చులతో అన్నదానం నిర్వహించడం జరుగుతోందన్నారు. 59 వ వార్షికోత్సవం సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా తన వంతుగా ఈరోజు సుమారు 9 వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ తనకు తోచిన రీతిలో సమాజ సేవ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. అనంతరం ప్రత్యేక పుజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ని ప్రజలు సుఖః సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్దించినట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం లో ఆలయ ట్రస్ట్ ఛైర్మన్, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *