Breaking News

Latest News

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో పరిశ్రమలకు రాచబాట : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి

-త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు -రూ.50 కోట్ల లోపు పెట్టుబడులతో ఏర్పాటయ్యే పరిశ్రమలకు భూమి పూజ, శంకుస్థాపన -తొలుత ఛైర్మన్ సొంత జిల్లా అనంతపురం జిల్లా నుంచి మొదలయ్యేలా షెడ్యూల్ ప్లాన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరింత పురోగమిస్తోందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. రూ.50 కోట్ల లోపు పెట్టుబడులతో ఏర్పాటవుతోన్న పరిశ్రమలకు భూమి పూజ, శంకుస్థాపన చేసే దిశగా ఏపీఐఐసీ అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. …

Read More »

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

-అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు -సాధారణ భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగ కుండా తగు జాగ్రత్తలు -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తదుపరి పాత్రికేయులతో ఆయన …

Read More »

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కోలగట్ల వీరభద్ర స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా శుక్రవారం అసెంబ్లీలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వద్ద కోలగట్ల వీరభద్ర స్వామి నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు మరియు బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు,మాజీమంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పి.పుష్పశ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోలగట్ల వీరభద్ర స్వామి శాసన సభాపతి తమ్మినేని సీతారాంను కలిశారు.

Read More »

వెల్లంపల్లి మూడు రాజధానులు ఉండాలని ప్రజలు నమ్మితే రాజీనామా చేసి గెలువు : కొట్టేటి హనుమంతరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం పై మాట్లాడిన వెల్లంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాలని కొట్టేటి హనుమంతరావు (మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి) హెచ్చరించారు. కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో శుక్రవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ బుద్ధ వెంకన్న ఉత్తరాంధ్ర పర్యటనకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది ఆ విషయంలో కన్నీరు పెట్టుకున్నారని నువ్వు ఏమన్నా చూసావా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము ఉన్న నాయకుడు బుద్ధ వెంకన్న, …

Read More »

“స్వచ్చతా హీ సేవా” పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త: జిల్లా గ్రామ స్థాయిలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో భాగంగా “స్వచ్చతా హీ సేవా” (పరిశుభ్రతా సేవా కార్యక్రమాలు) పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయి లో ప్రతీ ఒక్క గ్రామ పంచాయతీని భాగస్వామ్యం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సమర్థవంతంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సింగిల్ యుజ్ ప్లాస్టిక్ నిషేధం పై గ్రామ …

Read More »

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించడం జరుగుతోంది…

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త: నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తెలిపారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి తో కలిసి అనపర్తి నియోజకవర్గం లోనూ బిక్కవోలు, అనపర్తి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లా ఇళ్ళ స్థలాల కోసం ధరకాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇంటి నిర్మాణం కోసం అనువైన స్థలాలను గుర్తించడం …

Read More »

పౌష్టికాహార లోపరహిత జిల్లాగా తీర్చిదిద్దాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: చిన్నారులలో పౌష్టికాహార లోపాన్ని నివారించి పౌష్టికాహార లోపరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పోషకాహార మాసోత్సవాల్లో భాగంగాజిల్లా మహిళాభివృది శిశుసంక్షేమ శాఖ,మార్పు ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో జ్యోతీ ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ …

Read More »

పంటల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలి…

-సామూహిక ఎలుకల నివారణ ద్వారా పంటలను సంరక్షించుకోవాలి… -జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రైతులు తమ పంటలను కన్నబిడ్డల వలె సంరక్షించుకోవాలని సామూహిక ఎలుకల నివారణలో ప్రతి రైతు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ఎస్‌ డిల్లీరావు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యలో జిల్లాలో చేపట్టిన సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నున్న వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన సామూహిక ఎలుకల నివారణ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ …

Read More »

స్వచ్ఛతాహి సేవా ద్వారా గ్రామాలలో పరిశుభ్రత ప్రచార కార్యక్రమాలను జయప్రదం చేయండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: కేంద్ర జలశక్తి మిషన్‌ సూచనల మేరకు స్వచ్ఛతాహి సేవా ద్వారా గ్రామాలలో చేపట్టిన పరిశుభ్రత ప్రచార కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను అధికారులు ఉద్యోగులు పాల్గొన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు. స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం నున్న గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత ప్రచార ర్యాలీని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి …

Read More »

సంక్షేమ పథకాల్లో సంచార జాతుల వారికి ప్రాధాన్యత ఇవ్వాలి!!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త: సంచార జాతులు, వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యతనిచ్చి వారి అభివృద్ధికి కృషి చేయాలని జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మానవహక్కుల కమిషన్‌ బోర్డు సభ్యులు తురక నర్సింహా కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని స్పందన మీటింగ్ హాలులో కలెక్టర్‌తో కలిసి సంబంధిత జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులాల వివక్షత, వివిధ ప్రజల మధ్య అంతరాలు మన సమాజంలో బలంగా వేళ్ళూనికిపోయాయని, డి-నోటిఫైడ్, …

Read More »