కోరుకొండ / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి పరిశీలన నిమిత్తం చైర్పర్సన్ రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వం లోని కేంద్ర నీటి వనరుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2024-25) సభ్యులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రత్యేక ప్రథాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం సాయంత్రం స్థానిక మధురపూడి విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం పలకడం జరిగింది. అనంతరం బృంద సభ్యులతో కలిసి స్థానికంగా రాజమహేంద్రవరం లో ఏర్పాటు చేసిన విడిది కి చేరుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. కమిటీ సభ్యులకు స్వాగతం పలికిన వారిలో ఇరిగేషన్ ఈ ఎన్ సి ఎం. వెంకటేశ్వర రావు, ఇతర అధికారులు ఉన్నారు.
చైర్పర్సన్ రాజీవ్ ప్రతాప్ రూడీ నేతృత్వం వహించిన బృందం రెండు విడతలుగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కలెక్టరు తెలిపారు. శనివారం ఉదయం ఇక్కడ నుంచి బయలుదేరి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి పరిశీలన నిమిత్తం వెళ్లడం జరుగుతోందని అన్నారు.
రాజ్యసభ సభ్యులు ఖిరు మహ్తో, శ్రీమతి ధర్మశీల గుప్తా, లోక్ సభ సభ్యులు రీ షేర్ సింగ్ ఘుబాయా,
రోడ్మల్ నగర్, జోయంత బసుమతరీ, నారాయణ్ దాస్ అహిర్వార్, శ్రీమతి సంజ్ఞ జాతవ్, సాగర్ ఈశ్వర్ ఖండ్రే, విశాల్ (దాదా) ప్రకాష్బాపు పాటిల్, మోహితే-పాటిల్ ధైర్యషీల్ రాజ్సిన్హ్ లు ఉన్నారు. ప్రోజెక్ట్ పరిశీలనకు రానున్నట్లు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News