Breaking News

Latest News

అనుబంధం, ఆప్యాయతకు ప్రతీక రాఖీ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనురాగాలు, ఆప్యాయతలకు ప్రతీక రక్షా బంధనం అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. సీతారామపురంలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాఖీ పండుగ ఎంతో పవిత్రమైనదని.. సోదర సోదరీ అనుబంధానికి రక్షా బంధనం ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకలలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మానవాళి సుఖంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ …

Read More »

సచివాలయాలు కేంద్ర బిందువుగా సుపరిపాలన: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-28వ డివిజన్ 203 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ/ వార్డు సచివాలయాలు కేంద్ర బిందువుగా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం 28 వ డివిజన్ 203 వ వార్డు సచివాలయ పరిధిలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, దాసాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ కనపర్తి కొండా, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. …

Read More »

దేశ భక్తిని పెంపొందించేలా కార్యక్రమముల రూపకల్పన చేయుట అభినందనీయం

-ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో మాజీ మంత్రి వెల్లంపలి శ్రీనివాస్ -ఉత్సాహంగా గాంధీ కొండపై హెరిటేజ్ వాక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా గాంధీ కొండపై గురువారం నిర్వహించిన హెరిటేజ్ వాక్ కార్యక్రమములో మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు  వెల్లంపలి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, గ్రందాలయ చైర్మన్ జమ్మల పూర్ణమ్మ పలువురు కర్పోరటర్లు అధికారులు …

Read More »

ముత్యాంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముత్యాలంపాడులో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో గురువారం విశేషమైన పర్వదినం శ్రావణమాసం, విఖనస మహర్షి యొక్క జయంతి, హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ, శ్రవణా నక్షత్రంతో కూడినటువంటి రోజు కనుక శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన రోజు శ్రీ మహా విష్ణువు కలియుగములో కలియుగనాధునిగా వెలసి మనందరిని అలరిస్తున్న చాలా పుణ్యమైన రోజు ఈ రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వైకుఠములో శ్రీ మహా విష్ణువుగా వెలసిల్లి కలియుగములో శ్రీ వేంకటేశ్వర స్వామిగా …

Read More »

గవర్నర్ హరి చందన్ కు రాఖీ కట్టిన చిన్నారులు

-నిరాడంబరంగా రాజ్ భవన్ లో రక్షాబంధన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రక్షాబంధన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషన్ హరిచందన్ కు చిన్నారులు రాఖీ కట్టారు. విజయవాడ రాజ్ భవన్లో అతినిరాడంబరంగా రాఖీ వేడుకను నిర్వహించారు. పాఠశాల, కళాశాల విద్యార్ధుల వినతి మేరకు అతికొద్ది మందిని మాత్రమే రాజ్ భవన్ కు అనుమతించారు. నగరంలోని నిర్మలా ఉన్నత పాఠశాల, నల్లూరి వారి సెయింట్ మాధ్యూస్ ఉన్నత పాఠశాల, తక్షశిల ఐఎఎస్ అకాడమీకి చెందిన విద్యార్ధులు రాజ్ భవన్ కు వచ్చి గౌరవ …

Read More »

సీఎం జగన్‌కు రాఖీలు కట్టిన మహిళా నేతలు, ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి​కి హోంమంత్రి తానేటి వనిత, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల, రుడా చైర్‌పర్సన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీ, గెడ్డం ఉమ రాఖీలు కట్టారు. వీరితో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, …

Read More »

‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారాన్ని విజయవంతం చేయండి…

-గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ నివాసాలలో ఆవిష్కరించటం ద్వారా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. శనివారం నుండి ఆగస్టు 15 వరకు ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో రాజ్‌భవన్‌ దర్బార్‌ హాల్‌లో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తూర్పు నౌకాదళ కమాండ్‌కు చెందిన గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలను గవర్నర్‌ శ్రీ …

Read More »

ఆప్యాయత, అనుబంధలకు ప్రతీక రాఖీ పండుగ : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతిలో అనురాగం, ఆప్యాయత, అనుబంధలకు ప్రతీకగా కులమతాలకు అతీతంగా జరుపుకొనే పండుగ రాఖీ పౌర్ణమి అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, నియోజకవర్గ మహిళ కార్పొరేటర్ లు,మహిళ నాయకులు అవినాష్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు గుర్తుగా …

Read More »

ఉన్నత విద్యాతోనే పేదరిక నిర్మూలన సాధ్యం – దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ ఆడిటోరియంలో తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదివేన కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యం తో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం ఉన్నతమైన చదవుల వల్లనే పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమని,అందుకే అధికారంలోకి వచ్చిన …

Read More »

మీట్ ది కమిషనర్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ప్రతి గురువారం మీట్ ది కమిషనర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కార్మికులు తమ సమస్యలపై నేరుగా ఫిర్యాదులు లేదా అర్జీలు అందించవచ్చని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. గురువారం కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, మరియు సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కై …

Read More »