Breaking News

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో జిల్లా లో గల ప్రైవేట్ ట్రావెల్స్ బస్ యజమానులు మరియు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్ల యజమానుల తో సమావేశము నిర్వహించ బడినది. ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతముల నుండి వారి స్వస్థలాలకు వచ్చే ప్రయానికుల నుండి నిర్ణీత చార్జీల కంటే అధిక చార్జీల ను వసూలు చేసిన మరియు ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించినా అటువంటి వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసు కుంటామని తెలిపారు.

ఈ పండుగ సందర్భంగా స్పెషల్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని వీరు నిరంతరం 10-01-2025 వ తేదీ నుండి 20-01-2025 వ తేదీ వరకు తనిఖీలు నిర్వహిస్తారు కావున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యంకల్పించ వద్దని కోరారు. సరైన రికార్డులు లేక నిబంధనలకు విరుద్దంగా తిరిగే బస్సుల పై తగు చర్యలు తీసుకొని బస్సులు జప్తు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు సంబందించిన లాగేజి కాకుండా, వర్తక వస్తువులను బస్సులలో తరలించ కూడదని తెలిపారు. బస్సు యజమానులు వారి సిబ్బందికి ప్రయాణికు లను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరే వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. బస్సులలో అగ్ని ప్రమాదాలు జరగ కుండా అవసరమైన పరికరములను సరిగ్గా వున్నావో లేదో ఒక సారి పరీక్ష చేసుకొని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సమావేశంలో బస్ యజమానులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్లు మరియు మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్లు సిహెచ్
సంపత్ కుమార్, ఎం వి ఐ, జి రాధికదేవి, కె. చైతన్య సుమ, పివివిడి సాయి కుమార్ ఏ. ఎం. వి.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *