విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం వారు కుల సంఘ నాయకులు వడ్డెర ఓబన్న గారి 221 వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలని వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల సంజీవయ్య రాయుడు అన్నారు ఈ సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంజీవ రాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర్ల మహాసభ ఈనెల 11వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరుగుతుందని అన్నారు. వడ్డెరలను బీసీఏ నుండి ఎస్టీ జాబితాలోకి చేర్చాలని గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో హామీలు ఇచ్చారని, హామీలను నెరవేర్చాలని అన్నారు. గత ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ నిధులు ఇవ్వలేదని, ఈ ప్రభుత్వమైనా వడ్డెర కార్పొరేషన్ కి 250 కోట్లు మంజూరు చేయాలని, వడ్డెర్లకు రక్షణ చట్టం కావాలని, గనులలో క్వారీలలో, 25 శాతం వడ్డెర్లకు రిజర్వ్ చేయాల ని ప్రభుత్వాన్ని కోరుతు న్నామని అన్నారు. గత ఎలక్షన్లలో వడ్డెరలు ఈ ప్రభుత్వ విజయానికి కృషి చేశామని అన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చుట కు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు, రాజ్యసభకు, పంపి బిల్లు పాస్ అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. నామినేష న్ పద్ధతిన 15% పనులు రిజర్వ్ ప్రభుత్వ పనులు చేయాలని, రాష్ట్రవ్యా ప్తంగా మేము 40 లక్షల మందిని ఉన్నామని, గనుల్లో చనిపోయిన వారికి ఉచిత బీమా కింద 10 లక్షలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని, ఎలాంటి బ్యాంకు హామీలు లేకుండా మాకు రుణాలు మంజూరు చేయాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర్ల సంక్షేమ సంఘ మహాసభను విజయవంతం చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షులు వడ్డెర సంఘం సంక్షేమ సంఘ విజయవాడ వేముల అంకేశ్వరరావు, మీడియా సలహాదారులు సింగ్ నగర్ ఉప్పు రాంబాబు, వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఓరుసు శివ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.కొండూరు, ఓరుసు వీర భాస్కర్, జేఏసీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News