Breaking News

Latest News

గంజాయి, మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడకుండా అవగాహన కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గంజాయి, మాదకద్రవ్యాలకు యువత అలవాటు పడకుండా అవగాహన కల్పించటం, అమ్మకాలపై గట్టి నిఘా ఉంచి జిల్లాను గంజాయి, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరి సలహాలు సూచనలతో ముందుకు వెళదామని జిల్లా కలెక్టర్ యస్. ఢిల్లీరావు అన్నారు. యువతను గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యాల వాడక విష సంస్కృతి నుండి రక్షించి చెడు వ్యసనాలకు బానిస కాకుండా తీసుకోవలసిన చర్యలపై ఆదివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు అధికారులు, వైద్యనిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి …

Read More »

గుంటూరు కు ప్రతి4 నిమిషాలకో బస్సు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా తెనాలినుండి గుంటూరు కు ప్రతి4నిముషాలకో బస్సు ఫ్లీక్వెన్సి(Frequency) పెంచామని తెనాలి DM రాజశేఖర్ అన్నారు. అంతకు మునుపు ప్రతి 5 నిమిషాలకు బస్సుండేదన్నారు. కొత్తగా జిల్లాకేంద్రాలైన”బాపట్ల” “మచీలీపట్నం” నేరుగా వెళ్ళటానికి బస్సు ప్రతిపాదనలు డివిజన్ అథికారులకు పంపామని, తెనాలి నుండి దంతలూరు మీదుగా కొల్లిపర, చినపాలెం దుగ్గిరాల బస్సు వేసినట్లు అలాగే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం కు ఉదయం ఫ్రీక్వెన్సీ ఉదయం 5-15, -45 ,7-45,పెంచినట్లు తెలిపారు. బస్సు డిపో వెనుక వైపు …

Read More »

మూడేళ్లలో మొత్తం రూ. 33,42,500 అందజేత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో రైతు భరోసా మొదటి విడత ద్వారా 80 రైతు కుటుంబాలకు రూ. 4,40,000 లబ్ధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు రుణదాతలపై ఆధారపడకుండా అవసరమైన వనరులు సకాలంలో కొనుగోలు చేసుకునేందుకు గాను రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ నియోజకవర్గానికి గాను 73 రైతు …

Read More »

కృష్ణా డెల్టా భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జల సంరక్షణతో ఉమ్మడి కృష్ణా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన సర్ ఆర్థర్ కాటన్ జిల్లావాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. అపర భగీరథుడి 219 వ జయంతి సందర్భంగా గవర్నర్ పేటలోని నీటి పారుదల కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీరు అందించటంలో సర్ ఆర్థర్ కాటన్ చేసిన …

Read More »

40లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పార్క్ కు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక 42 వ డివిజన్, వెలంపల్లి కాలనీలో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పార్క్ కు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ హెచ్ బికాలనీ లో గల వెలంపల్లి కాలనీ లో ఉన్న కామన్ ఏరియా లో 40 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా పార్క్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు జగనన్న ప్రభుత్వం …

Read More »

స్పందనను వినియోగించుకోండి…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 16.05.2022 సోమవారం ఉదయం 10.30 ని.ల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు న‌గ‌ర పాల‌క సంస్థ‌ ప్ర‌ధాన కార్యాలయము మరియు మూడు సర్కిల్ కార్యాలయములలో “స్పందన ” కార్యక్రమం నిర్వహించ బడుతుందని, ప్రజలు నేరుగా తమ యొక్క సమస్యల అర్జీలను అధికారులకు అందించవచ్చునని కమిషనర్ తెలిపారు.

Read More »

మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణాలు…

-శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కృషితో పేదలకు న్యాయం -దశాబ్దాల నాటి పేదల సొంతింటి కల నెరవేరుతున్న వైనం -శరవేగంగా అమలవుతున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు పథకం మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద మైలవరం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలు మంజూరు కాగా, పక్కాగృహాల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ కృషితో దశాబ్దాల నాటి పేదల సొంతింటి కల నెరవేరుతుంది. దీంతో లబ్ధిదారులైన పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులు …

Read More »

హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం

  -ఆలయ స్థల పురాణం హనుమాన్ జంక్షన్, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా – పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన హనుమాన్ జంక్షన్ లో నూజివీడు జమీందారు, మాజీ మంత్రి ఇ ఎం. ఆర్, అప్పారావు  తండ్రి శ్రీ మేక వెంకటాద్రి అప్పారావు బహుదూర్  స్వామివారి నిలువెత్తు విగ్రహాన్ని 1938వ సంవత్సరంలో ప్రతిష్టించారు. జమిందార్ మేకా వెంకటాద్రి అప్పారావు బహుదూర్ ఒకసారి హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆయనకు విపరీతమైన ఆకలి వేయటంతో ఆహారం కోసం వెతికారు. కానీ చుట్టుపక్కల …

Read More »

వైభవంగా శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత నాగేశ్వరస్వామి వారి కళ్యాణం

-కమనీయంగా శ్రీ స్వామి వారి కళ్యాణం నిర్వహించిన ఎమ్మెల్యే పేర్ని నాని, జయసుధ దంపతులు మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ఖొజ్జీలపేటలో వేంచేసియున్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వరస్వామి వార్ల కల్యాణం ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) జయసుధ దంపతులు కమనీయంగా నిర్వహించారు. ఈనెల 11న మొదలై 19 వరకు నిర్వహిస్తున్న శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ నాగేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ స్వామివారి కల్యాణం అంగ రంగ వైభవంగా …

Read More »

పర్యాటక శాఖ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి

-జానపద కళారూపాలను ప్రోత్సహించాలి : రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె.రోజా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక శాఖ అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా పేర్కొన్నారు. శనివారం స్థానిక శ్రీ పద్మావతి అతిథిగృహంలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని …

Read More »