Breaking News

మూడేళ్లలో మొత్తం రూ. 33,42,500 అందజేత: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-సెంట్రల్ లో రైతు భరోసా మొదటి విడత ద్వారా 80 రైతు కుటుంబాలకు రూ. 4,40,000 లబ్ధి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు. రైతులు రుణదాతలపై ఆధారపడకుండా అవసరమైన వనరులు సకాలంలో కొనుగోలు చేసుకునేందుకు గాను రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ నియోజకవర్గానికి గాను 73 రైతు కుటుంబాలకు రూ. 13,500 చొప్పున రూ. 9 లక్షల 85 వేల 500 అందజేయడం జరిగిందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 73 రైతు కుటుంబాలకు రూ. 9 లక్షల 85 వేల 500., 2021-22 ఆర్థిక సంవ‌త్సరానికి గానూ 81 రైతు కుటుంబాల‌కు రూ. 9,31,500 రైతుల ఖాతాలలో జ‌మ‌చేయ‌డం జ‌రిగిందన్నారు. 2022-23 ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి రైతు భ‌రోసా మొద‌టి విడ‌త‌ కార్యక్రమంలో భాగంగా 80 రైతు కుటుంబాల‌కు రూ. 4,40,000 రైతుల ఖాతాలలో సోమవారం నిధులు జ‌మ‌చేయ‌డం జ‌రుగుతుందని వెల్లడించారు. 2019 నాటి నుంచి ఇప్పటివరకు మూడేళ్లలో మొత్తంగా రూ. 33 లక్షల 42 వేల 500 రూపాయలు రైతు భరోసా పథకం ద్వారా నియోజకవర్గంలోని అన్నదాతలకు లబ్ధి చేకూరినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. గ‌త చంద్రబాబు ప్రభుత్వం రైతుల‌ను నిండా ద‌గా చేసింద‌ని.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచించింద‌ని పేర్కొన్నారు. కానీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం రైతుల ముంగిటకే వ్యవసాయ పథకాలను తీసుకువచ్చిందని వెల్లడించారు. రైతులు తమ సొంత కాళ్లపై నిలబడాలన్నదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రికి అన్నదాత‌ల త‌ర‌పున మరోసారి ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టణాలే గ్రోత్ ఇంజిన్లు

-వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు చేపట్టాలి -అర్బన్ ప్రాస్పెరిటీ విభాగంగా పట్టణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దాలి -పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *