Breaking News

Latest News

నిరుపేదల ఆరోగ్యానికి భరోసా ముఖ్యమంత్రి సహాయనిధి

-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా రూ. 10.69 లక్షల విలువైన చెక్కుల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భరోసా కల్పిస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గ పరిధిలో కొత్తగా 12 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 10.69 లక్షల విలువైన చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఇప్పటివరకు 881 మందికి రూ. 4 కోట్ల 8 లక్షల …

Read More »

మహిళమణుల అభ్యున్నతికి వైస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలుపరుస్తు ప్రజల చేత జై జై లు కొట్టించుకుంటు, ప్రజల మన్ననలు పొందుతున్నఒకే ఒక్కడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మంగళవారం నాడు పరిటలా ఓంకార్ కళ్యణ మండపం వేదికగా నియోజకవర్గ పరిధి లోని 4,10 మరియు 11 డివిజన్ల సంబంధించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని 195 స్వయం సహాయక సంఘాలకు దాదాపు 28 లక్షల 27 వేలు …

Read More »

అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి

-పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం -మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాస రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆర్. టి. సి. వర్క్ షాప్ రోడ్డు, యస్. కన్వెన్షన్ హాల్ నందు 38, 39, 40, 41, 42, మరియు 52వ డివిజన్లకు సంబందించి నిర్వహించిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి 842 స్వయం సహాయక సంఘాల వారికీ రూ. …

Read More »

నగరంలోని ఖాళి స్థలములు మెరక చేసేలా చర్యలు తీసుకోవాలి

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ -క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్.ఐ.సి కాలనీ అంతర్గత రోడ్ల యందు పారిశుధ్య నిర్వహణ సక్రమముగా లేకపోవుట పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, సంబందిత శానిటరీ సూపర్ వైజర్ సలీమ్ అహ్మద్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని మరియు 17వ సచివాలయం శానిటరీ సెక్రెటరి వై.భవన ను విధుల నుండి సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం సర్కిల్-3 …

Read More »

ఫ్యూచర్‌ జనరాలి ఇన్సూరెన్స్‌ సొల్యూషన్స్‌ ద్వారా మరిన్ని సేవలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యూచర్‌ జనరాలి ఇన్సూరెన్స్‌ సొల్యూషన్స్‌ ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని సంస్థ జోనల్‌ మేనేజర్‌ మనీష్‌ కౌశల్‌ అన్నారు. ఆరోగ్య, వాహన ఇన్సూరెన్స్‌ రంగంలో తమ సంస్థ మెరుగైన ఫలితాలను సాధిస్తోందని ఆయన వివరించారు. నూతన ప్రాంగణంలోకి తమ కార్యాలయాన్ని మార్పు చేసినట్లు ఆయన చెప్పారు. బందర్‌ రోడ్‌లోనే ఫ్యూచర్‌ జనరాలి ఇన్సూరెన్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ కార్యాలయాన్ని ఆర్టీసీ కాలనీ ఫన్‌ టైమ్స్‌ రోడ్‌లోకి మార్చారు. శ్రీ విద్యా నిలయం మూడో ఫ్లోర్‌ లో నూతనంగా …

Read More »

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో ముఖ్యమంత్రి భేటీ

-ఈనెల 30న ఢిల్లీలో జరగనున్న ముఖ్యమంత్రులు, సీజేల సమావేశం అజెండాపై చర్చ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో, ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈనెల 30న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల భేటీ దృష్ట్యా సమావేశం అజెండాపై ఇరువురు చర్చించారు. ఏప్రిల్‌ 4, 2016 నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతితోపాటు, పేరుకుపోయిన …

Read More »

సచివాలయంలో ట్రాన్స్ కో అధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

– ట్రాన్క్ కో పటిష్టంగా ఉంటేనే మెరుగైన విద్యుత్ వ్యవస్థ – ట్రాన్స్ కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. రూ.3897.42 కోట్లతో పనులు – వ్యవసాయానికి విద్యుత్ కోసం రూ.223.47 కోట్లతో పనులు – పనులను నిర్థిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలి – లో ఓల్టేజీ, ఓవర్ లోడ్ సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలి : మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించాలంటే ఎపి ట్రాన్స్ కో పటిష్టంగా …

Read More »

సి.పి.ఎస్.పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు మంత్రుల కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు 25వ తేది సోమవారం జిఓ సంఖ్య 716 ద్వారా మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు …

Read More »

తాగునీటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు… : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని కృష్ణాజిల్లాలో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా ఇరిగేషన్ ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులు ఇప్పటినుండే పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్ లో నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో తాగునీటి ఎద్దడి నివారించడానికి ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణాజిల్లాకు నీరు విడుదల చేశారన్నారు. ప్రకాశం బ్యారేజ్ …

Read More »

ప్రజల వద్దకే స్పందన..

-96 ఆర్జీల రాక.. -సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో గ్రామ సచివాలయం-1లో సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆర్జీదారులు సమర్పించిన వినతులను స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందనలో వివిధ సమస్యల పరిష్కారానికి 96 ఆర్జీలు అందాయని సబ్ కలెక్టర్ తెలిపారు. వీటిలో రెవెన్యూ, …

Read More »